Balakrishna : చంద్రబాబు చేయలేని పని పట్టాభి కోసం బాలకృష్ణ చేశారు.

బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి.. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరంలో కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మరోవైపు ఈ ఘర్షణలకు సంబంధించిన నమోదైన కేసుల్లో గన్నవరం కోర్టు టిడిపి నేత పట్టాభి 14 రోజులపాటు రిమైండ్ విధించింది. పట్టాభి తో పాటు మరో పదిమంది టిడిపి నేతలకు కూడా కోర్టు రిమాండ్ విధించింది. పట్టాభికి చికిత్స నిమిత్తం జిజిహెచ్ కు తరలించారు ఆదేశించారు. అలాగే వైద్య పరీక్షల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు.

గన్నవరం ఘర్షణల కేసులో పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మంగళవారం పట్టాభి జడ్జి ముందు తన వాంగ్మూలం ఇచ్చారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర ముసుగులో ఉన్న ముగ్గురు తనపై దాడి చేశారని ఆయన జడ్జికి తెలిపారు. అరగంట పాటు కాళ్లు, చేతులపై కొట్టినట్లు ఆయన కోర్టుకి తెలిపారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం జడ్జి తాజా ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు పట్టాభి ఇంటికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. పట్టాభి భార్య కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు. టిడిపి పార్టీ మీకు అండగా ఉంటుందని.. మీరు ధైర్యంగా ఉండలని అన్నారు. పట్టాభి కుటుంబ సభ్యులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు గన్నవరం పార్టీ ఆఫీసు పై దాడి చేసిన వారిని పోలీసులే ఎంకరేజ్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్ పై దాడులు జరిగిన రోజే పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించు ఉంటే ఇలాంటి దాడులు జరిగి ఉండేవి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బాలయ్య స్పందించారు. పట్టాభి కి మరో 10 మందికి బాలయ్య స్వయంగా లాయర్ ను ఏర్పాటు చేశారు. వాళ్లు త్వరగా బయటకు తీసుకువచ్చేందుకు లాయర్ కు సూచనలు చేశారని సమాచారం. బాలయ్య అరేంజ్ చేసిన ఈ లాయర్ సామాన్యమైన వ్యక్తి కాదని ఈయన కేస్ టేకప్ చేస్తే కచ్చితంగా ప్రత్యర్ధులను ముప్పతిప్పలు పెట్టి నిజం బయట పెట్టేస్తారని నాకు కూడా ఉందట. అలాగే పార్టీ కార్యాలయం పై దాడి చేసిన ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలని బాలయ్య కోరాడట. ఈ విషయంలో చంద్రబాబు పట్టాభి కోసం చేయలేని పని నందమూరి బాలకృష్ణ చేశారని టిడిపి ఫ్యాన్స్ అంటున్నారు.