Avinash Reddy : అవినాష్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Avinash Reddy : సీబీఐ తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలంటూ.. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్‌ వేసిన వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డికి కోర్డు సానుకూలమైన తీర్పు ఇచ్చింది. సోమవారం వరకు తనను సీబీఐ అరెస్ట్ చేయదని హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Avinash Reddy arrest High court decision
Avinash Reddy arrest High court decision

వైఎస్ వివేకా ప్రాణాలు తీసిన కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ, తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని.. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై శుక్రవారం విచారణ జరిపింది. తరువాత హైకోర్టు సీబీఐకి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయద్దని తెలిపింది..

మూడోసారి సీబీఐ అవినాష్ ను ఈ రోజు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. వివేకా కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని.. ఆలాగే తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని కోరారు. అదేవిధంగా వివేక హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదని చెప్పారు. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ వ్యతిరేకించాలన్నారు. అయన చెప్పిన మాటల ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతోందని తెలిపారు.

తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాధారాలు లేకపోయినప్పటికీ.. ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వివేక కేసులో దర్యాప్తు అధికారి తీరు పారదర్శకంగా లేదని అవినాష్‌ రెడ్డి తన పిటిషన్‌లో తెలిపారు. మొత్తానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ సోమవారం వరకు వాయిదా పడింది. మంగళవారం మరోసారి ఆయనను విచారించనున్నారు.

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి