Chandrababu : కృష్ణాజిల్లాలో చంద్రబాబు పర్యటన అనేక ఉద్రిక్త వాతావరణలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గురువారం గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో తెలుగుదేశం మరియు వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం జరిగింది. అయితే శుక్రవారం గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలో మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ ఆరుగొలను జంక్షన్ వద్ద తెలుగుదేశం మరియు వైసిపి కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నీ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై దాడి ఘటన పట్ల అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. కృష్ణాజిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న క్రమంలో వరుసగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరగటం పట్ల చంద్రబాబు పోలీస్ శాఖపై మండిపడినట్లు సమాచారం.

చంద్రబాబు రాక కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేచి చూస్తూ ఉండగా ఈ ఘటన చోటుచేసుకుందట. వైసీపీ జెండా పట్టుకుని వచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడిన చోట రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించడంతో వివాదం నెలకొందట. దీంతో పోలీసులు అతడిని పక్కకి లాక్కెళ్ళిన గాని గొడవ మొదటతో తెలుగుదేశం మరియు వైసీపీ వర్గాల మధ్య… ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే పరిస్థితి నెలకొందట. ఈ పరిణామంతో గన్నవరం చంద్రబాబు పర్యటన రసభసగా మారింది. ఇదిలా ఉంటే ఓ నెల రోజుల క్రితం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి జరగడం తెలిసిందే. అయితే ఆ దాడిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు అరెస్టు అయ్యారు.
ఈ గొడవలో హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త కళ్యాణిపై అత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో గన్నవరం నియోజకవర్గం పర్యటనలో చంద్రబాబు.. అరెస్ట్ అయిన కళ్యాణి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలో కుప్పం పర్యటన సమయంలో ఇదే తరహా ఘటనలో చోటు చేసుకున్నాయి. ఆ టైంలో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీ చంద్రబాబు కుప్పం పర్యటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.