Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన చాలా ఎన్నికలు వైసీపీ తిరుగులేని విజయాలు సాధించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గ కుప్పంలో కూడా వైసీపీ గెలవడం సంచలనం సృష్టించింది. దీంతో తెలుగుదేశం పార్టీ అయిపోయింది చంద్రబాబు.. ముసలోడు అయిపోయాడని.. పార్టీ నడిపే నాయకుడు లేడని రకరకాల విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి. కానీ తాజాగా పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అదేవిధంగా… ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ఊహించని విజయాలు సాధించడం జరిగింది.
ఏకంగా వైసీపీ స్ట్రాంగ్ .. కంచుకోట లాంటి రాయలసీమలో టీడీపీ అభ్యర్థులు గెలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఊహించని విధంగా ఏపీలో టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వైసీపీ నాయకులపై చేసిన కొన్ని కామెంట్ల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై బూతులు మంత్రి అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డ వీడియో.. వైరల్ గా మారింది. వైసీపీ నేతల మాట తీరు విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ ఒకప్పుడు రాజకీయాలు చాలా గౌరవప్రదంగా ఉండేవి. కానీ ఇప్పుడు చిల్లర నాయకులు ఎక్కువైపోయారు. రాజకీయాలలో బూతులు తిడితే ఎంత బాధేస్తుంది. మొన్నటిదాకా ఓ బూతులు మంత్రుండేవాడు.
రీసెంట్ గా పదవి పోయింది. ఇంకా మహిళలు గురుంచి మాట్లాడుతూ…రాష్టంలో మహిళలు ఎన్నో బాధలు పడుతున్నారు. కానీ తాను డ్వాక్రా సంఘాలు పెట్టడంతో వాళ్ల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో కాలేజీలలో ఆడపిల్లలకు 33% రిజర్వేషన్ తాను తీసుకురావడం వల్ల అనేకమంది కంప్యూటర్ విద్యను అభ్యసించి ఇతర దేశాల్లో సెటిల్ అయ్యారని స్పష్టం చేశారు. దీంతో వరకట్నాల గొడవలు కూడా తగ్గాయని.. చంద్రబాబు తన హయంలో మహిళల విషయంలో చేసిన మంచి పనుల గురించి చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.