Balakrishna : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న చాలా నిర్ణయాలలో కొన్ని వివాదాస్పదం కావడం తెలిసిందే. వాటిలో ఒకటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చటం. గత ఏడాది తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. అదే సమయంలో నందమూరి అభిమానులు మరియు కుటుంబ సభ్యులు.. హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అంటి వారు కూడా తీవ్రస్థాయిలో విభేదించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వం పై మండిపడి ఏకంగా తన కాన్వాయ్ తో విజయవాడ రావడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి బాలయ్యను రిక్వెస్ట్ చేసి వెనక్కి పంపించడం జరిగింది. ఇది తెలుసుకున్న కళ్యాణ్ రామ్.. ఆ సమయంలో బాలయ్యకి మద్దతుగా రంగంలోకి దిగటానికి ప్రయత్నాలు చేసినట్లు సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో తిరుగులేని విజయాలు సాధించడం జరిగింది. దీంతో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో నందమూరి హీరోలు టీడీపీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని తాజా వీడియో పోస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు సూచనలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని కాపాడుకునే పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకొని.. ఎలాగైనా వైయస్ జగన్ ని గద్దె దించాలని కోరుతున్నారు. అవసరమైతే వైసీపీ నీ కులగోట్టడానికి మిగతా పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరుతున్నారు. ఈసారి ఎన్నికలలో పార్టీని గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఇటువంటి వీడియోలను పోస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలు సూచనలు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు.