Gudivada Amarnath : గుడివాడ అమర్నాథ్ పై ఆనం సెటైర్స్.. పంచింగ్ పలక్ నమాకే పంచా.? 

Gudivada Amarnath : ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యిందని.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం మొదటిసారి అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మన రాష్ట్రానికి 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.. 6 లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభిస్తుంది అని తెలిపారు.. ఎంవోయూలు గ్రౌండింగ్‌ అయ్యేలా సీఎస్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఎంవోయూ పారదర్శకంగా రూపొందిందన్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యిందని.. అడ్డగోలుగా విమర్శించే వాళ్ళ నోళ్లే.. అబ్బురపోయేలా పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రానికి పోటెత్తింది తెలిపారు. ఈ విషయంపై ఆనం తనదైన శైలిలో స్పందించి గుడివాడ అమర్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఏపీలో ఇలాంటి కార్ రేసింగ్ ఈవెంట్లు ఎప్పుడు నిర్వహిస్తారని మీడియా మిత్రులు అడుగగా.. ఏపీలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది‌ అది పెట్ట కావడానికి టైం పడుతుందని ..మరోసారి తనదైన శైలిలో ఏపీ మంత్రి అమర్నాథ్ స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని మొన్నే కదా గుడివాడ అమర్నాథ్ ఆంధ్ర ప్రదేశ్ కోడి గుడ్డు పెట్టిందన్నారు.. ఇంతలోనే కోడి పెట్ట ఎలా అయింది పెట్ట అవడంతో పాటు బరిలోకి ఎలా దూకింది. అంతేకాకుండా 5నుంచి 6 కేజీలు మాంసం ఇచ్చే పెట్ట లాగా ఎలా తయారయింది అంటూ విమర్శలు చేశారు. ఏది ఏమైనా సరే ఇలాంటివి వారికే సాధ్యం అంటూ ఆనం చలోక్తులు విసిరారు..

 

ఈ మూడు నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందని ఇండస్ట్రీలన్నీ ఎగబడి ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. ఏం ఉందని ఇక్కడికి వస్తున్నారు ఏం చూసి ఎక్కడికి వస్తున్నారు అని ఆనం ప్రశ్నించారు. మిగతా వ్యక్తులు కూడా ఈ విషయంపై స్పందించే విధంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఏం అభివృద్ధి జరిగిందని అదేవిధంగా అమర్నాథ్ లాంటి మేధావులు కోడిగుడ్డు నిజంగా ఈరోజు అమర్నాథ్ కి కంగ్రాట్స్ చెప్పాలి.. ఇంత ఫాస్ట్ గా కోడిగుడ్డుని పెట్టలాగా చేశారు అంటూ పంచులు వేశారు అనం. కోడిగుడ్డు పలిగి పుంజు అయిపోయింది. ఆ పుంజు కూడా బాగా బలిష్టంగా తయారయ్యాలా చేశారు అంటే అది అమర్నాథ్ క్రెడిట్ అంటూ సెటైర్స్ వేశారు ఆనం.. కోడిగుడ్డు అన్నారో లేదో 14, పెట్టుబడులు వచ్చాయి కోడుగుడ్డు ఎఫెక్ట్ ఏంటో మీకు అర్థమైందా అంటూ చెలోక్తులు విసిరారు అనం. ఎం ఓ యు లు చేయవలసిన పనిలో సగం బాధ్యతలు అమర్నాథ్ చేశారు అంటూ తనదైన శైలిలో పంచులు వేశారు. ఇది చూసిన మరి కొంతమంది పంచింగ్ పలకనామకే పంచా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.