Venkataramana Reddy – Anil Kumar : ఏపి రాజకీయాలలో వైసీపీకి నెల్లూరు జిల్లా కంచుకోట అని అందరికీ తెలుసు. 2014 మరియు 2019 ఎన్నికలలో ఇక్కడ అత్యధిక స్థానాలు వైసీపీ గెలవడం జరిగింది. జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి ఈ జిల్లా నాయకులు ఎంతో మద్దతు తెలిపారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇటీవల వైసిపి పార్టీపై చాలామంది సొంత పార్టీ నేతలు ఎదురు తిరగటం తెలిసిందే. ఆ రీతిగా జగన్ కి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన వారిలో మెజారిటీ నాయకులు నెల్లూరు జిల్లా ప్రాంతానికి చెందిన వాళ్లు.
ఇక ఇదే నెల్లూరు జిల్లాలో జగన్ కి నమ్మినబంటు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆనం వెంకటరమణారెడ్డి .. అనిల్ కుమార్ యాదవ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ పనులు 90 శాతానికి పైగా కంప్లీట్ అయ్యాయి. ఇంకా డ్రింకింగ్ వాటర్ సప్లై వర్క్ కూడా దాదాపు పూర్తి అయిపోయాయి. అయితే ఈ నాలుగు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఈ పనులను ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు. ఒక్క ఇటుక తీసి కూడా పక్కన పెట్టలేదని విమర్శలు చేశారు.
అప్పట్లో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ లేదా ఇప్పుడు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరిలో ఎవరైనా చొరవ తీసుకొని ఈ పనులు పూర్తి చేశారా అని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. 95% పనులు పూర్తయిన ప్రాజెక్టులకు సంబంధించి ఐదు శాతం పనులు పూర్తి చేయలేని ఈ వైసీపీ నేతలు అభివృద్ధి చేస్తారంటే మనం విన్నాలా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో పదవ తరగతి సరిగ్గా చదువుకొని జగన్ ని అడగాలా అంటూ కూడా ఆనం వెంకటరమణారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు సెటైర్లు వేశారు.