CBI : 2019 ఎన్నికల్లో సీఎం అవ్వటానికి జగన్ చేసిన తప్పులు బయటపడుతున్నాయని తాజా పరిస్థితులపై బయట ప్రచారం జరుగుతోంది. పూర్తి విషయంలోకి వెళ్తే సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారం టైములో వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య జరిగిన సమయంలో వైసీపీ నాయకులు కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు చేశారని ఆరోపించడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం ఉంది కనుక ఇది వాళ్ళు చేసిన హత్య అని.. చెప్పుకొచ్చారు. మరోపక్క కడప ప్రాంతంలో సానుభూతి ఓట్ల కోసం సొంత బాబాయ్ నీ వైయస్ జగన్ చంపించాడని టీడీపీ నేతలు ఆరోపించడం జరిగింది. అయితే ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సీబీఐ ఎంక్వయిరీ కోరడం జరిగింది.
ఆ తర్వాత ఎన్నికలు జరగటం… జగన్ ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో పరిస్థితి మొత్తం తారుమారు కావడంతో పాటు ఇప్పుడు ఏకంగా జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు తెరపైకి రావటంతో పాటు ఆయన తండ్రి అరెస్ట్ కావటం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో సొంత బాబాయిని వైసీపీ నేతలు చంపినట్లు టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణలకు బలం చేకూరినట్లు అయింది.
ఇదిలా ఉంటే సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కావలసిన పరిస్థితి నెలకొన్న సమయంలో… ముందస్తు బెయిల్ పిటిషన్ వేయటం వైసీపీ గ్రాఫ్ మరింత తగ్గించినట్లు అయింది. ఇక ఇదే సమయంలో కోడి కత్తి కేసులో… జగన్ ముఖ్యమంత్రి కావాలని.. నిందితుడు కావాలని తానే జగన్ గొంతుపై దాడి చేసినట్లు ఒప్పుకోవటంతో మొత్తం అంతా… రివర్స్ అవుతూ ఉంది. 2019 ఎన్నికలలో గెలవడానికి వైసీపీ దొడ్డిదారులలో ప్రజలను అయోమయానికి గురిచేసి గెలిచిందని… తాజా పరిణామాలపై కామెంట్లు వస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికలలో వైయస్ జగన్ గెలుస్తాడా లేదా అన్నది డౌటే అని అంటున్నారు.
కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి
https://www.youtube.com/watch?v=KnVlGVeNrT0