YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం యొక్క జిల్లాగా మారబోతోంది.. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాట్లు కాబోతున్నట్లు సమాచారం.. బుధవారం, గురువారం లో ఆఫీషియల్ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తాజా సమాచారం..!!రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. అరకు పార్లమెంటు స్థానం నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా అరకు ఎంపీ స్థానాన్ని రెండు జిల్లాలుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలోనే జీవో జారీ చేసింది.ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం పేరు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. సరిహద్దులు అన్నింటి పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై జగన్ కూడా సమీక్షించారాని.. కొత్త జిల్లాల ఏర్పాటు పై బుధవారం, గురువారం లోపు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వెలువడనున్నట్లు సమాచారం.