YCP : రానున్న ఎలక్షన్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటినుంచే సిద్ధమవుతుందా అంటే నిజమే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.. గత ఎన్నికలలో గెలుపోవటములను నిర్ణయించింది మాత్రం గ్రామీణ ఓటర్లే.. అర్బన్ ఓటర్లు పోలింగ్ కూడా రారు .. అర్బన్ ప్రాంతంలో ఎప్పుడు పోలింగ్ చాలా తక్కువగా ఉంటుంది.. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 80% పోలింగ్ ప్రతి ఎన్నికలో నమోదు అవుతుంది.. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృష్టి అంతా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారు.. సంక్షేమ పథకాలతో జగన్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రాంగ్ గా ఉందని.. ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.. కానీ అర్బన్ లో మాత్రం వైసిపి చాలా వీక్ గా ఉంది.. ఈ విషయాన్ని గ్రహించిన జగన్ అర్బన్ లో ఓట్లు పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు..
పథకాల కోసం లక్షల కోట్లు వెచ్చించడం, అభివృద్ధి జరగకపోవడంతో అర్బన్ ప్రాంతం ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారు.. ప్రధానంగా ఉద్యోగ వర్గాలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి.. జీతాలు కూడా సకాలంలో చెల్లించకపోవడం వారు తప్పుపడుతున్నారు. ఇక చెత్త పన్ను వేయడం, ఆస్తి పనులను పెంచడంతో అర్బన్ ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం పట్ల కొంత అసహనం పెరుగుతుంది . ఈ నేపథ్యంలో అర్బన్ ప్రాంతాల్లో వైసిపి ఇబ్బందులు ఎదుర్కొంటున్ననే చెప్పాలి. కానీ ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో కొంత పాజిటివ్ టాక్ వస్తుంది. అర్బన్ ప్రాంతంలో భూముల విలువ పెరగడంతో పాటు జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడం, జగనన్న కాలనీలను ఏర్పాటు చేయడం వంటి వాటితో కొంత ఊరట లభించింది..

పార్టీకి బలం చేకూరే విధంగా జగన్ ప్రయత్నం చేస్తున్నారు.. జగన్ ఇటీవల ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే పర్యటనలు చేస్తున్నారు.. ఎక్కువగా పథకాలకు నగదు అందించే కార్యక్రమాలను పట్టణాల్లోనే చేస్తున్నారు.. ఇటీవల కాలంలో మచిలీపట్నంలోని పెడన, విశాఖపట్నం ఇలా ఎక్కువగా అర్బన్ ఏరియాస్ లోని తిరుగుతున్నారు.. పీకే టీం సర్వేల లోను అర్బన్ ప్రాంతాల్లోనే పార్టీగా వీక్ గా ఉందని నివేదికలు తెలిపాయి.. దాంతో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలను జగన్ అలెర్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. పట్టణ ప్రాంత ఓటర్లలో కొంత మార్పు తేగలిగితే విజయం ఖాయం అనే దిమాలో ఉన్నారు. అందుకే అర్బన్ ప్రాంతాలపై ఫోకస్ పెంచుతున్నట్లు కనిపిస్తోంది.. అర్బన్ ప్రాంతాలలో ఎలక్షన్స్ కంటే ముందు నుంచే ఫోకస్ పెడితే కాస్త సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని జగన్ ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో పర్యటనలు చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు..