శతాబ్దాలుగా భారతీయ వంటకాలలో నెయ్యిని విరివిగా వాడుతున్నారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని చెబుతారు, అయితే నెయ్యి గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వీటివల్ల దాని ప్రయోజనాలను ప్రజలు పూర్తిస్థాయిలో తెలుసుకోలేకపోతున్నారు అలాగే దాని నుంచి చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నెయ్యి గురించి మీరు నమ్మడం మానేయాల్సిన 5 అపోహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుందనేది నిజమే కానీ ఇది గుండె ఆరోగ్యానికి హాని కలిగించని ఒక రకమైన శాచురేటెడ్ ఫ్యాట్. కాబట్టి నెయ్యి భేషుగ్గా తీసుకోవచ్చు.
2. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి నెయ్యి అనారోగ్యకరం అనేది కూడా అపోహే. నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగల కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ (CLA)ను కూడా కలిగి ఉంటుంది.
3. నెయ్యి తింటే లావు అవుతారనే అబద్ధాన్ని బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు బాగా నమ్ముతుంటారు. నెయ్యిలో కేలరీలు ఎక్కువగా ఉన్నాయనేది నిజమే అయినప్పటికీ, ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. తద్వారా తక్కువ ఆకలి అవుతుంది అప్పుడు ఎక్కువ తినం కాబట్టి బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
4. శాకాహారులకు నెయ్యి తగినది కాదు. ఇది కూడా నిజం కాదు. కొబ్బరి నూనె లేదా పామాయిల్ వంటి మొక్కల ఆధారిత కొవ్వుల నుంచి నెయ్యిని తయారు చేయవచ్చు.
5. నెయ్యి వంటల్లో ఉపయోగించడం మంచిది కాదనేది కూడా వట్టి అబద్దం. నెయ్యి వివిధ ఉష్ణోగ్రతల వద్ద వంట కోసం ఉపయోగించవచ్చు.
నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. నెయ్యి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఆయుర్వేద వైద్యంలో నెయ్యి ఎక్కువగా వాడుతుంటారు. చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు, అనేక రకాల పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అయితే దీనిని మితంగా తీసుకోవడం ద్వారా కావాల్సిన ప్రయోజనాలను పొందవచ్చు.