Amaravathi Farmers : వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు కార్యక్రమానికి ప్రభుత్వానికి నిరసన సెగలు తప్పడం లేదు. తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలో గడపగడప కార్యక్రమంను వైసీపీ నేత కత్తిర సురేష్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి డుమ్మా కొట్టారు. రాజధాని అమరావతి అంశం గురించి ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే హాజరు కాలేదా అంటూ వైసీపీ నేత సురేష్ ను రాజధాని రైతులు నిలదీశారు..
జాబ్ క్యాలెండర్ , రోడ్లకు మరమ్మత్తులు, తాగడానికి మంచినీరు, బస్సు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి పై అభిప్రాయం ఏంటో చెప్పమని అమరావతి రైతులు నిలదీశారు. దాంతో వైసీపీ నేతలకు రాజధాని రైతులకు మధ్యన వాగ్వివాదం జరిగింది. మాకు రాజధాని ఎక్కడ అనే క్లారిటీ ఇవ్వాలని ఆ రైతులందరూ వైసిపి నేత సురేష్ ను నిలదీశారు. ఆయన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.
వారు వేసిన ప్రశ్నలకు సురేష్ దగ్గర సమాధానం లేకపోవడంతో అక్కడ నుంచి మౌనంగా వచ్చేశారు. ఇలాంటి ప్రశ్నలు మేమేస్తామని తెలిసి ఎమ్మెల్యే శ్రీదేవి కావాలని ఇక్కడికి రాలేదని తుళ్లూరు మండలం లోపలికి రాకుండా పల్లెలోకి మాత్రమే వచ్చి మీరు వెళ్తున్నారంటే.. మా ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర లేదా అని అర్థం కదా మేము కూడా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించాం కదా.. మాకు రాజధానిలో ఉన్న స్థలాన్ని అంతా రాజధాని కోసం ఇస్తే ఈరోజు మాకు కనీస వసతులు కూడా లేకుండా చేయడం తగదని అంటున్నారు.
దాంతో వైసిపి నేతలకు అమరావతి రైతులకు మధ్య మాటల తూటాలు పేలాయి. రైతులు అడిగిన ప్రశ్నలకు వైసీపీ నేతలు కూడా సమాధానం చెప్పలేకపోయారు. వారితో పాటు వచ్చిన పార్టీ కార్యకర్తలు కూడా ఆ విషయంలో కలిపించుకొని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా కూడా హరి దగ్గర కూడా సమాధానం లేకపోవడంతో నుంచి రాక తప్పలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.