Xiaomi Smart TV 5A : ఇండియన్ మార్కెట్లో షియోమీ ఎప్పటికప్పుడు అత్యధిక ఫీచర్లతో కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడమే కాకుండా స్మార్ట్ టీవీలను కూడా కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక వాటిని ఈ – కామర్స్ దిగ్గజ సంస్థలైన ఫ్లిప్ కార్ట్ అమెజాన్ ద్వారా అమ్మకానికి ఉంచుతూ భారీ డిస్కౌంట్ ను కూడా ప్రకటిస్తోంది. ఇక నేపథ్యంలోనే మరొక సరికొత్త స్మార్ట్ టీవీ ని పరిచయం చేస్తోంది షియోమీ.. ఇక తాజాగా షియోమీ స్మార్ట్ టీవీ 5A ప్రో మోడల్ ను తాజాగా పరిచయం చేసింది. 32 అంగుళాల హెచ్డి రెడీ స్క్రీన్ తో 24W సౌండ్ అవుట్ పుట్ తో సరికొత్త ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ తో అందుబాటులోకి రానింది. ఇకపోతే ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ధర రూ.16,999.
మీరు కావాలంటే షియోమీ అధికారిక వెబ్సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ వంటి ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా రిటైలర్ దగ్గర ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలంటే మరికొన్ని రోజులపాటు ఎదురు చూడాల్సిందే. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అప్పుడు ఈ టీవీని మీరు రూ.15,999 కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా సాధారణ ఎల్ఈడి టీవీ ఉపయోగించినవారు స్మార్ట్ టీవీ ట్రై చేయాలనుకుంటే కచ్చితంగా ఈ మోడల్ ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. 60 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. ఇక 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ కూడా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ముఖ్యంగా చిన్న గదిలో స్మార్ట్ టీవీ ఉండాలనుకునే వారికి ఈ స్మార్ట్ టీవీ ఒక బెస్ట్ ఆప్షన్ . అంతే కాదు ఫైనల్ ట్యూనింగ్ కలర్స్ కోసం వివిడ్ పిక్చర్ ఇంజన్ ని కూడా అమర్చారు. ఇక 30కి పైగా భారతీయ భాషలు , ఇంటర్నేషనల్ కంటెంట్ పాట్నెస్ తో ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది . 300కు పైగా లైవ్ చానల్స్ ను చూడవచ్చు .అంతేకాదు పేరెంటల్ లాక్ తో కిడ్స్ మోడ్ కూడా ఉంటుంది. రిమోట్ లో క్విక్ మ్యూట్ , క్విక్ వేక్, క్విక్ సెట్టింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఏ 35 ప్రాసెసర్ కు అప్ గ్రేడ్ ప్రాసెసర్ ఇది. 1.5 GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. 2 హెచ్డిఎంఐ 2.0 స్లాట్, 3.5MM జాక్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.