SmartPhone : ప్రస్తుతం ఈ కామర్ సంస్థ అమెజాన్ లో స్మార్ట్ఫోన్ అప్గ్రేడ్ డేస్ సేల్ లో మునుపెన్నడు లేని విధంగా భారీ డిస్కౌంట్ తో కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం గమనార్హం. బడ్జెట్ , మిడ్ రేంజ్, ప్రీమియం, ఫ్లాగ్ షిప్ ఇలా అన్ని కేటగిరీల స్మార్ట్ ఫోన్ లపై తగ్గింపు ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి . ఇక ఒక ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తూ ఉండడం ఆశ్చర్యకరం. ఇక ఈ అమౌంట్ కి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ కూడా వస్తుందని చెప్పవచ్చు. అంటే ఒక ఫోన్ కొన్న తర్వాత దానిపై లభించే డిస్కౌంట్తో మరొక ఫోన్ ని కొనుగోలు చేయడం ..అంటే 1+1 ఆఫర్ అని చెప్పడంలో సందేహం లేదు.
మరి ఆ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. షావోమి ఇండియా నుంచి ఈ సంవత్సరం షావోమీ 11T 5G ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ విడుదలైన విషయం తెలిసిందే. 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టెక్నాలజీ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ను హైపర్ ఫోన్ పేరుతో చావుమి ప్రచారం చేసింది ఇక ప్రీమియం సెగ్మెంట్లో పాపులర్ అయిన ఈ మొబైల్ పై ఇప్పుడు ఏకంగా 10,000 తగ్గింపు లభిస్తూ ఉండడం గమ. ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసేటప్పుడు ధరలు కనక మనం చూసినట్లయితే.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 అలాగే 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999.
గత కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 2000 రూపాయల వరకు తగ్గింపు లభించింది. ఇక గత కొన్ని రోజుల క్రితం 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ లో రూ.39,999 ధర కలిగిన స్మార్ట్ ఫోన్ ఇప్పుడూ కేవలం రూ. 29,999 కే సొంతం చేసుకోవచ్చు అంటే రూ.40,000 బడ్జెట్లో రిలీజ్ అయిన మొబైల్ ఇప్పుడు రూ.30,000 లోపే లభిస్తుండడం విశేషం. ఇకపోతే అమెజాన్ స్మార్ట్ఫోన్ అప్గ్రేడ్ డేస్ సెల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.10,000 భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. త్వరపడండి ఆఫర్ ముగిసేలోపే ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవడం మంచిది.