Workout..ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురై మరణించిన వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాటి నుంచి ఎంతోమంది యువకులు కూడా మరణించారు. తాజాగా హైదరాబాదులోని ఆసిఫ్ నగర్ లో ఒక కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. హార్ట్ ఎటాక్ తో విశాల్ అనే యువకుడు మృతి చెందారు. ఈయన కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది కేవలం 24 సంవత్సరాల వయసులోనే విశాల్ మృతి చెందారు.
ఇంత చిన్న వయసులోనే పైగా జిమ్ వ్యాయామం చేస్తూ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న సిబ్బంది సీపీఆర్ చేసినా కూడా అప్పటికి ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. విశాల్ 2020 బ్యాచుకు చెందిన కానిస్టేబుల్ 2023లో ఉద్యోగాన్ని సంపాదించి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. విశాల్ బోయినపల్లి లో నివాసముంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించాడు .కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోని అంతా జరిగిపోయిందని అక్కడున్న వ్యక్తులు తెలియజేస్తున్నారు.
Watch CCTV Footage 👇
He died at gym due to heart attack. pic.twitter.com/FbA6hghS4E— Arbaaz The Great (@ArbaazTheGreat1) February 23, 2023