Jobs : రాత పరీక్ష లేకుండానే.. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..!!

Jobs : ప్రస్తుతం నిరుద్యోగులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఉద్యోగాలను విడుదల చేస్తూ ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన షిల్లాంగ్ లోని నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ (NEIGRIHMS) లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. ఇక ఆసక్తికరమైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం.

Without a written test Jobs in the health department 
Without a written test Jobs in the health department

1). మొత్తం ఖాళీల సంఖ్య-54 : ఈ 54 పోస్టులు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇందులో అనాటమీ, బయో కెమిస్ట్రీ, జనరల్ సర్జరీ, అనస్థిషియాలజీ, మైక్రో బయాలజీ, ఆప్తమాలజీ, న్యూరాలజీ తదితర విభాగాల లో ఈ పోస్టులు ఖాళీ గా ఉన్నవి..

2). వయోపరిమితి : అభ్యర్థులు ఈ పోస్టులకు 45 సంవత్సరాలు మించకుండా ఉండవలెను.

3). జీతభత్యాలు : అభ్యర్థులకు నెలకు రూ.67,700 రూపాయల వరకు జీతభత్యాలను చెల్లిస్తారు.

4). అర్హతలు : ఇక ఈ పోస్టులకు సంబంధించిన వాటిలో స్పెషలైజేషన్లు మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్/డిప్లమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. అంతేకాకుండా ఆయా విభాగాలలో కచ్చితంగా అనుభవం ఉండాలి.

5). ఎంపిక విధానం : అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది.

6). ఇంటర్వ్యూ జరుగు తేదీలు : ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్లు తెలుస్తోంది.

7). అడ్రస్ : కాన్ఫరెన్స్ హాల్, నైగ్రీన్ గెస్ట్ హౌస్, మాది యాంగ్ధి యాంగ్ , షిల్లాంగ్ లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

అభ్యర్థులు ఏదైనా పూర్తి సమాచారం కోసం అధికారిక లింకులో http://www.neigrihms.gov.in/ చూడవచ్చు . అభ్యర్థులు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎలాంటి సమాచారాన్ని అయినా అధికారిక వెబ్ సైట్ లోనే పొందుపరచటం జరిగింది.