Pimples : ముఖం మీద మొటిమలు.. మొటిమల కారణంగా వచ్చే మచ్చలు .. తొలగి పోక ఎంతోమంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. ఈ కారణంగా అమ్మాయి కొంత వరకు అసహ్యకరంగా మారితే నల్ల మచ్చల వల్ల మరింత అందవిహీనంగా కనిపిస్తుంది. మొటిమలను , మచ్చలను దూరం చేసుకోవడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములను ఉపయోగించినా ఫలితం లేక ముఖాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. అందుకే అమ్మాయిలు మార్కెట్లో దొరికేటువంటి ఏది పడితే ఆ క్రీం ఉపయోగించకుండా మీ చర్మతత్వానికి సూటయ్యే క్రీమ్ లను ఎంచుకోవాలి అని ఇప్పటికీ ఎంతోమంది వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు తీసుకొచ్చిన కొన్ని క్రీమ్స్ రాయడం వల్ల ఎవరైనా సరే ముఖం మీద ఉన్న మచ్చలను , మొటిమలను దూరం చేసుకోవచ్చు.

పాలిసిలిక్ యాసిడ్ : ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో ఈ క్రీం లభిస్తోంది. కేవలం క్రీమ్ రూపంలోనే కాదు.. సీరం, లోషన్ , జెల్ రూపంలో మనకు అందుబాటులో ఉంది. ఇక దీనిని ఉపయోగించడం వల్ల ముఖం పై ఏర్పడిన రంధ్రాలను పూడ్చడానికి చాలా సహాయపడుతుంది. ఇక డెడ్ స్కిన్ సెల్స్ ను దూరం చేయడంలో ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మచ్చలను దూరం చేయడంలో.. మొటిమలు తిరిగి ఫార్మ్ అవకుండా ఉండడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. పాలిసిలిక్ యాసిడ్ ఉపయోగించడం వల్ల చర్మం కొద్దిగా పొడిబారినట్లు అనిపిస్తుంది కాబట్టి వెంటనే మాయిశ్చరైజర్ ను కూడా అప్లై చేసుకోవాలి. కచ్చితంగా మొటిమలు మచ్చలు దూరం అవుతాయి.
బెంజాల్ పెరాక్సైడ్ : క్రీమ్, లోషన్, సీరం, జెల్ రూపంలో లభిస్తుంది. మీకు గనక చీముతో కూడినటువంటి మొటిమలు ఉన్నట్లయితే ఈ బెంజాల్ పెరాక్సైడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ముఖం మీద ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక మొటిమలను , మొటిమల తాలూకు వచ్చిన మచ్చలను రంధ్రాలను కూడా దూరం చేసి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. అయితే ఇది అప్లై చేసిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయడం తప్పనిసరి.