Money investment : పెట్టుబడి తక్కువగా ఉండాలి మెరుగైన రిటర్న్స్ రావాలి అని ఆలోచించేవారు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్నో రకాల ఆప్షన్లను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.. అన్ని విధాలుగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంతో మంది సలహాలు తీసుకొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది.. ఇక అలాంటి వాటిలోని స్టాక్ మార్కెట్ బెస్ట్ బెనిఫిట్ అని చెప్పవచ్చు. విజువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ పరిస్థితిని బట్టి మనకు వచ్చే రిటర్నులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి.. ఒకవేళ ఆ మార్కెట్ సరిగ్గా లేకపోతే.. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక పోవచ్చు..
కానీ ఒకసారి తగిలిందంటే మాత్రం కోటీశ్వరులు అవ్వడం ఖాయం..అందుకే రిస్కుతో కూడుకున్నది కాబట్టి మధ్యతరగతి కుటుంబం వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు.. పోస్ట్ ఆఫీస్లో అందుకు బెస్ట్ ఆప్షన్ అది చెప్పవచ్చు.. ఇందులో రిస్కు ఉండకపోగా మనం పెట్టుబడి పెట్టిన దాని కంటే ఎక్కువ మొత్తంలో ని రిటర్న్స్ రావడం జరుగుతుంది.. వాటిలో గ్రామ్ సురక్ష స్కీం కూడా ఒకటి.. చిన్న పొదుపు అయినప్పటికీ డబ్బులు మాత్రం అధికంగా వస్తాయి. అంటే మీరు నెలకు కేవలం 1500 రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లయితే అతి తక్కువ సమయంలోనే రూ. 35 లక్షల ను పొందవచ్చు.

ఇకపోతే 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు.. రూ. 10 వేల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టే ఆస్కారం ఉంటుంది.. ఉదాహరణకు 19 సంవత్సరాల వయసులో ఈ పాలసీలో చేరినట్లు అయితే అప్పటి నుంచి మీకు యాభై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు నెలకు 1515 రూపాయలు చెల్లిస్తే.. 60 సంవత్సరాల తర్వాత 30 లక్షలకు పైగా మీరు పొందవచ్చు.. పాలసీ లో చేరిన తరువాత నాలుగు సంవత్సరాల అనంతరం లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది.