Jobs : రూ.2 లక్షలకు పైగా జీతంతో.. ఇండియన్ ఆయిల్ సంస్థ లో జాబ్స్..!!

Jobs : భారతీయ ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్.. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో ఖాళీగా ఉన్న గ్రేడ్-C, గ్రేడ్-B పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. అర్హులైన అభ్యర్థులు ఇందు కోసం దరఖాస్తు చేసుకోవచ్చట. ఇక నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

With a salary of over Rs 2 lakh Jobs in Indian Oil Company
With a salary of over Rs 2 lakh Jobs in Indian Oil Company

1).మొత్తం పోస్టుల సంఖ్య-55

ఇందులో గ్రేడ్-B పోస్టులు 50, గ్రేడ్-C పోస్టులు 5 కలవు.

2). వయసు : అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 25 ,2022 వ తేదీ నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

3). జీతభత్యాలు : ఈ పోస్టులకు అభ్యర్థులు సెలక్ట్ అయినట్లు అయితే వారికి ప్రతి నెలా రూ.80,000 నుంచి రూ. 2,20,000 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు.

4). అర్హతలు : పోస్ట్ ను బట్టి సంబంధిత కోర్సుల్లో 65 శాతం మార్కులతో.. డిగ్రీ/ఎమ్ డి/పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. ఇక అంతే కాకుండా సంబంధిత విభాగాల లో పని లో అనుభవం కూడా ఉండాలి.

5). ఎంపిక విధానం ; అభ్యర్థులను రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

6). పరీక్ష విధానం : అభ్యర్థులకు మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.. ఇందులో రెండు గంటల సమయం కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు.

7). దరఖాస్తుకు చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ చివరి తేదీ.. జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.500 ఫీజు..sc,st, ఎక్స్ సర్వీస్ మెన్ లకు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

అభ్యర్థులకు పూర్తి వివరాల కోసం https://www.oil-india.com/ ఈ వెబ్ సైట్ ను సంప్రదించండి.