
Phone love Story : యూపీ ఘజియాబాద్ లోని నంది గ్రామంలో ఉంటున్న శివాని అనే మహిళ పోలీసులకు ఫోన్ చేసి అర్జెంటుగా రావాలని కోరింది. నా భర్త తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.నాకు భయంగా ఉందని ఫోన్లో బోరున ఏడ్చింది. అప్పటికే రాత్రి 11:40 నిమిషాలు. నంది గ్రామ పోలీసులు ఆమె చెప్పిన నందిగ్రామ్ ఈ బ్లాక్ అడ్రస్ కి వెళ్లారు. మహిళ గట్టిగా రోదిస్తూ బయట కూర్చుని పోలీసులు ఇంట్లోకి వెళ్ళగానే శివాని భర్త తుపాకీతో ఎడమవైపు కాల్చుకుని చనిపోయాడు. తుపాకీ కూడా ఎడమవైపే చేతికి దగ్గరలో బెడ్ పై ఉంది.కపిల్ భార్య రోదిస్తూ ఉంది. అయితే అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాడు. అని ఏడుస్తూ ఉంది. ఇతర కాలనీవాసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు పోస్టుమార్టం చేయించి ఆ మరుసటి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
అయితే పోలీసులకు క్రైమ్ సీన్ లోని అనుమానం కలిగింది. కపిల్ చౌదరి కుడి చేతి వాటం మనిషి అయితే ఎడమవైపు తుపాకీ కూడా అతి దగ్గర నుంచి కాల్చుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి.పైగా అది నాటు తుపాకీ పైగా మధ్య తరగతికి చెందిన కపిల్ తుపాకీ కొనుక్కొని కాల్చుకోవాల్సిన అవసరం లేదు. చనిపోవాలి…అనుకునేవాడు మరో విధంగా చనిపోయేవాడు. అయితే దానికి పోలీసులు శివాని కాల్ డేటా తీయగా పోలీసుల ఎమర్జెన్సీ ముందు కంటే ఓ వ్యక్తికి కాల్ చేసింది. అతని పేరే అంకుష్ పోలీసులు విచారణ చేయగా అతను వయసు 22 అయితే శివానికి అతనికి అక్రమ సంబంధం ఉందని ఫోన్లో చాటింగ్స్ మరియు కాల్స్ ద్వారా గుర్తించారు.
పోలీసులు శివానిని విచారణ చేయడంతో అసలు క్రైమ్ డెత్ గేమ్ బయటకు వచ్చింది. భర్త ఆఫీస్ కి వెళ్ళగానే ప్రియుడిని పిలిపించుకుని ఇంట్లోనే ఎంజాయ్ చేసేది. ఈ విధంగా అతని మత్తులో పడిన ఈ శివాని పక్కా ప్లాన్ చేసి తన భర్తని చంపేసింది..