Wife : పెళ్ళయ్యి మూడు నెలలే అయ్యింది .. కట్ చేస్తే పెళ్ళాన్ని నడి రోడ్డు మీద చంపేసాడు – ఆమె ఫోన్ బ్లాక్ లిస్టు ఓపెన్ చేస్తే బిగ్ ట్విస్ట్ !

Wife : తమిళనాడు లో సుందరం, మీనాక్షి దంపతులకు వర్షా అనే కూతురు ఉంది. మధురైని కీరైతుర ప్రాంతంలో పళని అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వర్షా మైనర్ గా ఉన్న సమయంలోనే ఆమె మీద పళని కన్ను వేశాడు.. ఇద్దరి మధ్య వయసులో 9 సంవత్సరాలు తేడా ఉంది. కాగా రెండు సంవత్సరాల నుంచి వర్షా కూడా పళనిని ప్రేమించింది. పళని పని పాట చేయని అవారా..

Wife block her husband number unexpected end this story
Wife block her husband number unexpected end this story

పళని, వర్ష ప్రేమ విషయం తెలియగానే వర్ష కి అతను నీకు తగిన వాడు కాదని.. నిన్ను తను పోషించలేడని ఇంట్లో వాళ్ళందరూ శతవిధాల చెప్పారు. కానీ ప్రేమ గుడ్డిది.. వర్ష ఇంటి నుంచి పారిపోయిన పళనిని గత ఏడాది సెప్టెంబర్ నెలలో కుటుంబ సభ్యులను ఎదిరించి పెళ్లి చేసుకుంది. పళని, వర్షాల వివాహం జరిగి ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు. దారుణం జరిగిపోయింది.

వర్ష ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు కొన్ని బంగారు నగలు తీసుకుని ప్రియుడు పళని దగ్గరకు వెళ్ళింది. ఆ నగలు తాకట్టు పెట్టి నాలుగు నెలలు పబ్బం గడిపాడు.. ఆ తరువాత కుటుంబ పోషణ కోసం, ఇంటి అద్దె కట్టడం కోసం ఇంతకాలం వర్ష దగ్గర ఉన్న బంగారు నగలు ఒక్కోక్కటి తాకట్టు పెట్టి కాలం వెళ్ళబుచ్చాడు. దాంతో వర్షా, పళనిల మధ్య గొడవలు వచ్చాయి.

పళనితో కలిసి జీవించలేనని నిర్ణయించుకున్న వర్ష జనవరి నెలలో ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే వర్షా పుట్టింటికి వెళ్లిపోవడతో పళని అవమానంగా బావించాడు. మళ్లీ తనతో కలిసి జీవించాలని పళని అతని భార్య వర్ష మీద ఒత్తిడి చేశాడు. పళనితో మళ్లీ కలిసి జీవించాలనే కోరిక వర్ష కు లేకపోవడంతో తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలని నిర్ణయించుకుని.. భర్త పళని ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.

 

పలని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వర్ష ఇంటికి దగ్గరకు దుకాణానికి వెళ్లింది. ఆ సమయంలో హెల్మెట్ వేసుకుని బైక్ మీద వేగంగా వచ్చిన పళని క్షణాల్లో కత్తితో వర్షా మెడ, ముఖంపై దారుణంగా పొడిచేశాడు. భర్త పళని అకస్మాత్తుగా దాడి చెయ్యడంతో వర్షాకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. భార్య వర్షాను స్పాట్ లో చంపేసిన పళని అక్కడి నుంచి బైక్ లో వేగంగా వెళ్లిపోయాడు. సౌత్ గేట్ పోలీసులు అక్కడికి చేరుకుని వర్షా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాజాజీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పట్టపగలు భార్య వర్షాను దారుణంగా హత్య చేసిన పరారైనా పళని కోసం వెతికారు. చివరికి కీరతురా ప్రాంతంలో పళని పోలీసులకు చిక్కిపోయాడు.