ఇంట్లో మొగుడు, ఇంటెనకాల ప్రియుడు… రాసక్రీడలకు బానిసైన పెళ్ళాం మొగుడిని ఖతం చేసిన వైనం!

ప్రియుడితో రాసక్రీడలు నెరుపుతున్న ఓ యువతి తన భర్తను హతమార్చి, ఆ హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు సహకరించిన వారిలో ఆమె తండ్రి కూడా ఉండడం. అవును, కూతురు తప్పుచేస్తే మందలించి సన్మార్గంలో నడిచేలా చేయాల్సిన తండ్రి కూతురిపై ఉన్న గుడ్డి ప్రేమతో అల్లుడిని చంపే భాగంలో పాత్ర పోషించాడు. ఈ దారుణమైన ఘటన అనకపల్లి జిల్లా చోడవరం మండలంలోని మారుతీ నగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, అనకపల్లిలో నివాసముంటున్న హరి, ప్రీతి చూడచక్కనైన జంట. హరి ఒక ఫైనాన్స్ వ్యాపారి. ఉదయం పనిమీద బయటకు వెళితే, ఏ రాత్రికో వచ్చేవాడు. ఫైనాన్స్ వ్యాపారి కనుక డబ్బులు కాస్త బాగానే సంపాదించేవాడు. అన్ని సకల సౌకర్యాలు భార్యకి అందించాలని కష్టపడేవాడు. మరి ప్రీతికి ఏం లోటు అయిందోగాని, తమ ఇంటి వెనుక నివాసం ఉంటున్న ప్రణయ కుమార్‌తో పరిచయం పెంచుకుంది. కట్ చేస్తే ఆనతిలాలంలోనే అతగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. చేసిన తప్పు ఎన్నాళ్ళో దాగదు కదా. ఒకరోజు తనఇంట్లోనే వారిని బాగా క్లోజ్ గా చూసిన భర్త హరి, తీవ్ర మనస్థాపానికి గురై ఆమెను గట్టిగా మందలించాడు.

కానీ, అప్పటికే బాగా అలవాటు పడిన ప్రీతి తన ప్రియుడుని దూరం పెట్టలేకపోయింది. మరోవైపు తన భర్త ఈ విషయంలో ఆమెని వద్దని బాగా ఇబ్బంది పెట్టడంతో అతడిని చంపి, తన ప్రియుడు ప్రణయ్‌తో కలిసి ఎంచక్కా జీవితాంతం ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయింది. అనుకున్నదే తడవుగా ప్రీతి అదిరిపోయే పథకం వేసింది. గత నెల ఏప్రిల్ 17న అర్ధరాత్రి సమయంలో ప్రీతి తన భర్తను చంపించేందుకు తన తండ్రి సమరెడ్డి శంకర్ రావుతో పాటు ప్రియుడు బలయాది సింహ సాయి ప్రణయ్, తన స్నేహితులు అయినటువంటి లావేటి లలిన్ కుమార్, కర్రి రాము, పిట్లకొండ రాజు, సాయి అనే యువకుల సహాయం తీసుకుంది.

Advertisement

పార్టీపేరు చెప్పి అల్లుణ్ణి మావ ఫుల్లుగా మత్తులో ముంచేశాడు. మద్యం మత్తులో నిద్రపోతున్న హరిపై అందరూ కలిసి ఏకకాలంలో దాడి చేసి దుప్పటి, తలగడ సహాయంతో అతనికి ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా చంపేశారు. తరువాత అనుకున్న ప్లాన్ ప్రకారం… కారులో భర్త శవాన్ని తీసుకొని పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్ళింది ప్రీతి. తన భర్తకు గుండెపోటు వచ్చిందని, చికిత్స కోసం వచ్చామని డ్రామా ఆడింది. అప్పటికే తన భర్త చనిపోయాడని డాక్టర్లు చెప్పినట్టుగా బంధువులకు ఫోన్ చేసి నమ్మబలికింది.

Advertisement

కానీ, చేసిన పాపం పండే సమయం దగ్గరపడింది. ప్రీతిపైన అప్పటికే అనుమానం వున్న బంధువులు, హరి తల్లిదండ్రులు ప్రీతి భర్త మృతి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ… పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వారి స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. తరువాత ప్రీతి ఎన్నో రకాలుగా పోలీసులను నమ్మించాలని చూసింది గానీ, ఆమె తండ్రి సమరెడ్డి శంకర్ రావు ఊహించని షాక్ ఇచ్చాడు. భయపడిన శంకర్ రావు పాడేరు పోలీసుల ఎదుట చేసిన తప్పుని ఒప్పుకొని లొంగిపోయాడు. శంకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం నమోదు చేసుకున్న పాడేరు పోలీసులు.. ప్రీతి, ఆమె ప్రియుడు బలయాది సింహ సాయి ప్రణయ్, ఆమె స్నేహితులు లావేటి లలిన్ కుమార్, కర్రి రాము, పిట్ల కొండ రాజు, బషీర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

అందుకే పెద్దలు అంటారు… అధర్మం ఎప్పటికైనా వినాశనానికి దారితీస్తుందని. ఎంజాయ్ చేయాలనుకున్న ప్రీతి, ప్రియుడుతో పాటుగా అతని స్నేహితులు, ప్రీతి తండ్రి ప్రస్తుతం జైలు గోడలు మధ్యన బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement