Husband wife: భార్య భర్తల బంధం అనేది ఎప్పుడు ఆప్యాయత, అనురాగాలతో నిండి ఉండాలి.. ఆ జంటలు ఎప్పుడు చూసినా అన్యోన్యంగా ఉన్నారన్న భావన కలగాలి. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఎలాగ ఉంటారో.. ఆ తరువాత కూడా భార్యాభర్తలు ఇద్దరూ అలా ఉంటేనే ఆ జీవితానికి సార్ధకం చేస్తున్నట్టు లెక్క. ఆ బంధానికి పరిపూర్ణత వస్తుంది. ఆర్థిక చక్రంలో పడి నలిగిపోవటంతో పాటు వారి వ్యక్తిగత ఆనందాన్ని కూడా మరచిపోతున్నారన్నారు.. నేటి తరం వారిని డాక్టర్ పద్మా కమలాకర్.. నేటితరం భార్యాభర్తలకు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు అంతేకాకుండా ఈ సూచనలను ప్రతి ఒక్క భర్త పాటిస్తే వారి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని తెలిపారు ఇంతకీ ఆమె ఏమి చెప్పారో.. ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లయిన కొత్తలో కొత్తజంట మాట్లాడుకోవడానికి కాస్త సమయం ఇవ్వండి అని పెద్దలు చెబుతూ ఉండేవారు. ఇక పెళ్లయి కొంతకాలం గడిచిన తర్వాత భార్యాభర్తలు మాట్లాడుకోవడమే తగ్గించేస్తారు. ఇక పిల్లలు పుట్టాక సరే సరే అయితే ఈ పద్ధతి సరైంది కాదని చెబుతున్నారు డాక్టర్.. ప్రతిరోజు కాస్త సమయం పెట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు ప్రతి రోజు ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకొని ఆ టైంలో ఇద్దరు మాట్లాడుకునేలా చూసుకోవాలని అంటున్నారు అలా మాట్లాడుకుంటే మనసుకి స్వాంతన లభించి జీవితంపై ఉత్సాహం కలుగుతుందని ఆమె అన్నారు.
ముఖ్యంగా భర్త భార్య చేతిలో చేయి వేసి కులాసాగా కబుర్లు చెబితే ఆ ఆనందమే వేరు. భార్యకి వచ్చే మజానే వేరు. మీ భార్యతో కొన్ని క్షణాలైనా రోజుల్లో చేతిలో చేయి వేసి మాట్లాడండి. మీరు టీవీ చూస్తూనే కాలక్షేపం చేస్తూనే సమయంలోనే తన చేతిలో చేయి వేసి నువ్వు బాగున్నావానో నీ చేతి వంట బాగుందని లేదంటే భర్త వేసుకున్న టీ షర్టు బాగుందనో.. భర్త నడిచే స్టైల్ బాగుందనో.. ఇద్దరిలో ఒకరిని ఒకరు పొగుడుకోవడంలో తప్పే లేదని ఆ మాటలు ఇద్దరే మనసుకి హాయిని అందిస్తాయని తెలిపారు. బయటకు వెళ్ళినప్పుడు కూడా భార్య భర్త ఇద్దరు చేతిలో చేయి వేసుకొని నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు.
అదేవిధంగా భార్యాభర్త ఇద్దరు కలిసి స్నానం చేస్తే మంచి అనుభూతి కలుగుతుంది అని తెలిపారు. దీనిని తప్పుగా భావించకూడదని ఇద్దరి మధ్య అన్యోన్యత వేయించడానికి ఈ స్నానం అద్భుతంగా సహాయపడుతుందని డాక్టర్ తెలిపారు. ఇవి ప్రతి ఒక్క భర్త పాటిస్తే వారి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఇవి చేయడం వల్ల ఇద్దరి మధ్య స్ట్రెస్ తగ్గి బరువు పెరగకుండా ఉంటారని కూడా తెలిపారు. లేదంటే వాళ్ళు ఆలోచనలో పడి ఎక్కువగా హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా బరువు పెరుగుతారని అన్నారు.