SmartPhone : సామాన్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో అవసరాలకు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. కానీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న అన్ని ఫీచర్ల గురించి ప్రతి ఒక్కరికి తెలుసా అంటే?ఇది మాత్రం ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఎందుకంటే సాధారణంగా స్మార్ట్ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి కూడా సౌండ్ బటన్ , సెన్సార్ బటన్, కెమెరా, ఫ్లాష్ లైట్, పవర్ బటన్ అలాగే ఇయర్ ఫోన్స్ కనెక్టర్ , చార్జ్ పెట్టె పిన్ ఎక్కడ ఉంటాయో ఇవి మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఛార్జ్ పెట్టే పోర్టల్ పక్కన కనిపించే చిన్న రంద్రం.. లేదా ఫ్లాష్ లైట్ దగ్గర ముందు భాగాన సైడ్ కి కనిపించే చిన్నపాటి రంద్రం లేదా కొన్ని మొబైల్స్ లో కెమెరాల మధ్యలో ఇలాంటి చిన్న రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి.
అయితే ఈ రంద్రం అనేది ఒక్కొక్క స్మార్ట్ ఫోన్ ని బట్టి ప్రదేశం మారుతూ ఉంటుంది. ఇక ప్రదేశం ఏదైనా సరే స్మార్ట్ఫోన్లో ఈ చిన్న రంధ్రం ఎక్కడ కనిపించినా సరే దాని ప్రయోజనం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే ప్రతి స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుంది? దీని వల్ల ఉపయోగం ఏమిటి? అని మీలో ఎవరైనా? ఎప్పుడైనా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా..? ఒకవేళ ప్రశ్నించుకొని సమాధానం తెలియకపోతే ఈరోజు మేము మీకోసం ఆ సమాధానాన్ని తీసుకొచ్చాము. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మార్కెట్లో విడుదలైన కొత్త మొబైల్స్ ను తీసుకొని మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక రకమైన శబ్దాలు వినిపిస్తున్నాయని.. అందువల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించడం లేదని..
ఎంతోమంది తెలియ చేస్తూ ఉన్నారు. దీనిని నాయిస్ డిస్ట్రబెన్స్ అని అంటారు. అయితే మొదట వచ్చిన మొబైల్స్ కి అలాంటి సమస్య రాలేదు. మళ్లీ ఇప్పుడు సరికొత్తగా వస్తున్న మొబైల్స్ కి ఇలాంటి సమస్య ఎక్కువగా ఉందని పలువురు వినియోగదారులు కూడా కంప్లైంట్ లు చేస్తున్నారు. ఇందుకు గల కారణం ఏమిటంటే స్మార్ట్ మొబైల్స్ లో కనిపించే ఆ చిన్న రంధ్రం దగ్గర మీ చేయి ఉంచడం లేదా ఆ రంధ్రం లో డస్ట్ నిండిపోవడం లాంటివి జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇక ఆ రంధ్రం దగ్గర మినీ మైక్రోఫోన్ అనేది ఉంటుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ డివైస్ గా పనిచేస్తుంది. దీనివల్ల మనం ఫోన్ చేసినప్పుడు వాయిస్ లో ఎటువంటి అంతరాయం కలగకుండా అవతలి వారి మాటలు స్పష్టంగా వినిపించేలా ఈ రంధ్రం చేస్తుంది. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా వీటిని ఏర్పాటు చేస్తారు.