ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వివిధ పరిశ్రమలు, రంగాలలో ముఖ్యమైన భాగంగా మారుతోంది. చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏఐ అడాప్షన్ మరింత పెరిగిపోయింది. ఈ చాట్‌బాట్ ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దీంతో టెక్ దిగ్గజం గూగుల్ దీనికి పోటీగా గూగుల్ బార్డ్ అని AI చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఇప్పటికీ అభివృద్ధిలో ఉంది కానీ ప్రస్తుతానికి పబ్లిక్ గా అందుబాటులోకి వచ్చింది. ఇతర AI చాట్‌బాట్‌ల నుంచి ఇది చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇందులో కొన్ని ఫీచర్లు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్పోకెన్ రెస్పాన్సిస్: బార్డ్ వాయిస్ అసిస్టెంట్ వంటి వాయిస్ బేస్డ్ ఇంటరాక్షన్‌కు వీలు కల్పిస్తుంది. వినియోగదారులు పదాలను సరిగ్గా ఉచ్చరించమని లేదా వివిధ భాషల్లోని పద్యాలు/స్క్రిప్ట్‌లను బిగ్గరగా చదవమని బార్డ్‌ని అడగవచ్చు.
2. ఇమేజ్, వీడియో అనాలసిస్: గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్‌తో, బార్డ్ ఇమేజ్ లేదా వీడియోలను విశ్లేషించి వాటి గురించి తెలపగలదు. ఇది ఇమేజ్‌ల్లోని వస్తువులను గుర్తించగలదు, దృశ్యాల వివరణాత్మక వివరాలను ఇవ్వగలదు. ఇమేజ్‌ల్లోని టెక్స్ట్ ట్రాన్స్‌లేట్ కూడా చేయగలదు.
3. మల్టిపుల్ భాషల్లో రెస్పాన్స్‌లు: గూగుల్ బార్డ్ హిందీ, తమిళం, తెలుగు, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఉర్దూ, 40 ఇతర భాషలతో సహా వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇది మరిన్ని విదేశీ భాషలను కూడా త్వరలోనే జోడించనుంది.
4. గూగుల్ ప్రొడక్ట్స్‌తో సింక్: బార్డ్ గూగుల్ డాక్స్, షీట్స్, స్లయిడ్స్‌తో కలిసి పని చేస్తుంది. యూజర్లు బార్డ్‌ని ఉపయోగించి డాక్యుమెంట్స్, స్ప్రెడ్‌షీట్స్, ప్రెజెంటేషన్లను క్రియేట్ చేసుకోవచ్చు.
5. చాట్‌బాట్ పర్సనలైజేషన్: వినియోగదారులు చాట్‌బాట్ ప్రతిస్పందనలను కస్టమైజ్ చేసుకోవచ్చు, వారి ప్రాధాన్యతల ఆధారంగా సింపుల్, క్రియేటివ్, ప్రొఫెషనల్, కాజువల్ వంటి స్టైల్స్ మధ్య రెస్పాన్స్‌లు అందుకోవచ్చు.
గూగుల్ బార్డ్ అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుంది. చాట్‌జీపీటీ 2021 వరకు మాత్రమే జరిగిన సంఘటన గురించి తెలియజేస్తుంది. ఇంకా బార్డ్ నిన్న జరిగిన సంఘటన గురించి కూడా సమాచారాన్ని కలిగి ఉంటుంది.