మధ్యతరగతి అయిన గోవింద్ బిజినెస్ మాన్ కూతురుఅయిన శ్వేత కి డబ్బుకు కొదువు లేకుండా ఉండేది.కావున ఇద్దరూ ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు టూర్లకి బైక్లో వెళ్లేవారు. ఆ సమయంలో లాడ్జిల్లో శారీరకంగా కూడా దగ్గర అయ్యారు. ఈ విషయం తెలిసిన తమ తండ్రి పెళ్లి సంబంధాలు చూడగా వెంటనే శ్వేతా గోవిందును పెళ్లి చేసుకుందాం అని అడగ్గా లైఫ్ లో సెటిల్ అయ్యాక చేసుకుందామని ఒక బాంబు పేల్చాడు గోవింద్. నీకు డబ్బు తో పనిలేదు. నేను ఇస్తాను.. అంటూ పెళ్లి చేసుకుందామని ఎన్నిసార్లు చెప్పినా వినను గోవింద ఒకరోజు ఇంటికి తీసుకెళ్లి పెళ్లిగురించి మాట మాట అనుకుంటూ ఆగ్రహంతో శ్వేతాను గట్టిగా గోడకు బాదాడు గోవిందు.
ఆమె స్పృహ తప్పి కింద పడిచనిపోయింది. ఆ తరువాత గోవింద్ తమ తల్లి సాయంతో ఒక గోను సంచిలో వేసి బైక్ లో తీసుకెళ్లి ఒక నదిలో పడేయమని చెప్పి పంపగా ఎక్కువ ట్రాఫిక్ పోలీసులు ఉండడంతో తీసుకెళ్లే అవకాశం లేక తిరిగి మరి ఇంటికి తీసుకొచ్చి బాత్రూంలో వేసి పెట్రోల్ పోసి అంటించేసి..ఆ తరువాత శ్వేతానే ఇలా చేసుకుంది మేము కాపాడము అంటూ పోలీసులకు చెప్పారు. పోలీసులకు ఒక అనుమానం వ్యక్తం అయింది. ఆమెకి ఇంట్లో పెట్రోలు ఎక్కడి నుంచి వచ్చింది. పొంతన లేని సమాధానాలు మరింత అనుమానాన్ని వ్యక్తం చేశాయి. పోస్టుమార్టం లో ఆమె శరీరం మీద 13 గాయాలు ఉన్నట్టు బయటపడింది. అయితే ఇది కచ్చితంగా కుట్రేనని పోలీసులు వ్యక్తం చేశారు. వారి స్థాయిలో ఆరాధించగా గోవింద్ చెప్పిన నిజం నమ్మించి ఒప్పించి ప్రేమించి మోసం చేశానని నిజం ఒప్పేసుకున్నాడు గోవిందు. తర్వాత అతనికి మరణశిక్ష వేశారు.