ఈసారి ఐపీఎల్ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఆర్‌సీబీ కప్పు సాధిస్తుందా లేదా అనే దానిపై మరింత ఆసక్తి నెలకొంది. కాగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇది వర్షం వల్ల రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ పూర్తిగా రద్దైతే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ (క్వాలిఫైయర్ 1)కి అర్హత సాధించినందున, ఈ మ్యాచ్ రద్దైతే ఆర్‌సీబీ మొత్తం 15 పాయింట్లను కైవసం చేసుకుంటుంది.
అయితే, ఆర్‌సీబీ భవితవ్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ ముంబై ఇండియన్స్ (MI) మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో SRH గెలిస్తే, RCB ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. MI గెలిస్తే, ఆర్‌సీబీ నాకౌట్ అవుతుంది. MI ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
RCB vs GT మ్యాచ్ రద్దు కాకపోతే.. ఆర్‌సీబీ, GT రెండూ తమ తమ మ్యాచ్‌లలో ఓడిపోతే, RCB, RRలతో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ (RR) నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్‌లకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
రాత్రి 7:30 గంటలకు షెడ్యూల్ అయిన ఆర్‌సీబీ వర్సెస్ GT మ్యాచ్‌కు సంబంధించి, వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో మ్యాచ్ పూర్తిగా ఆపేస్తారా లేక ఓవర్ల తగ్గింపు జరుగుతుందా అన్న దానిపై స్పష్టత లేదు.