Jio : రిలయన్స్ జియో, తమ కష్టమర్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక ఈ క్రమంలోనే రూ. 750 ధర వద్ద లభించే ప్లాన్ తో రీఛార్జ్ చేయడానికి ఇదే సరైన సమయం.. ప్రస్తుతం మీ ప్లాన్ గడువు ముగిసేలోపు రీఛార్జ్ చేయడం ద్వారా మీరు ఈ ప్లాన్ క్యూలో ఉంచవచ్చు. ఇక ఈ రెండు ప్లాన్ల మధ్య కేవలం రూ. 31 మాత్రమే తేడా ఉంది. ఈ రెండింటిలో ఏది వినియోగదారులకు మంచి ఎంపికగా నిలవబోతుందో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
రూ.719 ధర వద్ద జియో అందించిన పాత ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాల విషయానికి వస్తే.. 84 రోజుల వ్యాలిడిటీతో లభించేది. అంతేకాదు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను అలాగే ప్రతిరోజు 2GB డేటా ప్రయోజనాలతో ఈ ప్లాన్ లభించేది. ఇక అంతే కాదు ఈ ప్లాన్ ద్వారా అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ అలాగే జియో సెక్యూరిటీతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రోజూ వారి డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps వేగంతో పనిచేస్తుంది. ఇక ప్లాన్ తో అందించే మొత్తం డేటా 168 GB, అంటే ఈ ప్లాన్ తో ప్రతి 1 జీబీ డేటా రూ.4.27 ఖర్చు వస్తుంది.
రూ.750 జియో ప్రీపెయిడ్ ప్లాన్.. రిలయన్స్ జియో స్వాతంత్ర్య దినోత్సవం వేడుక సందర్భంగా ప్రకటించిన కొత్త ధర రూ.750 ధర వద్ద లభిస్తూ ఉంటుంది. 90 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. కాబట్టి ఈ ప్లాన్ రెండు భాగాలుగా వస్తుంది. మొదటి భాగం రూ.749 ప్లాన్ అయితే రెండవ భాగం రూ.1 ప్లాన్ తో వినియోగదారులకు 90 రోజులు చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాలింగ్ 100 ఎస్ఎంఎస్ లతోపాటు రోజువారి 2జీబి డేటా ప్రయోజనాలను పొందుతారు. రూ .1 ప్లాన్ తో ప్రతిరోజు 100 ఎంబి డేటా 90 రోజులపాటు ప్రతిరోజు పొందవచ్చు. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో జియో టీవీ , జియో సినిమా ,జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటివి కూడా ఉన్నాయి.