WhatsApp : వాట్సప్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసరం అయిపోయింది . కాలక్షేపానికి మాత్రమే కాదు ఎన్నో ఫైల్స్ ను, ఫోటోలను, వీడియోలను ఒకరి నుంచి ఇంకొకరికి పంపించడానికి కూడా ఒక గొప్ప ఫ్లాట్ ఫామ్ అని చెప్పవచ్చు. ఇక ప్రపంచంలోనే చాలామంది మెసేజ్లు, వీడియో కాల్స్ కోసం ఈ యాప్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొందరైతే ఆడియో కాల్ కోసం కూడా వాట్సాప్ ని ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలోకెల్లా అత్యంత గుర్తింపు పొందిన ఏకైక యాప్ గా వాట్సప్ మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈ ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ ను ఫేస్బుక్ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ప్రస్తుతం వాట్సాప్ కి సంబంధించిన ఒక అలర్ట్ నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. ఇక అదేమిటి అనే విషయానికి వస్తే అక్టోబర్ నెల నుంచి కొన్ని ఫోన్లలో వాట్సప్ పనిచేయదు అనే వార్త హల్చల్ చేస్తూ ఉండడం గమనాభం.. ఇక ఈ వార్త నిజమే అని చెప్పాలి.. అసలు విషయంలోకెళితే కొన్ని IOS ఫోన్లలో అక్టోబర్ నుంచి వాట్స్అప్ పనిచేయడం మానేస్తుందట. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లు కాకుండా అక్టోబర్ 24 నుంచి ఐఓఎస్ 10 , ఐఓఎస్ 11 మీద పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి అని WABetalnfo స్పష్టం చేసింది. ఇక అందుకు సంబంధించిన హెచ్చరికలను సైతం ఆ ఐ ఓ ఎస్ లు వాడుతున్న యూసర్లకు కూడా పంపుతున్నట్లు చెబుతున్నారు.
ఐఫోన్లో వాట్స్అప్ కొనసాగాలి అంటే ఐఓఎస్ 12 లేదా తర్వాత ఐఓఎస్ కు అప్డేట్ చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు.అలా చేయని పక్షంలో అక్టోబర్ 24వ తేదీ నుంచి పాత ఐవోఎస్ లో కలిగి ఉన్న ఫోన్లో వాట్స్అప్ సేవలు నిలిచిపోనున్నాయి ఐఓఎస్ 10 ఐవోఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న ఐఫోన్ను ఈ విధంగా అప్డేట్ చేసుకోవాలి.. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ కి నావిగేట్ అవ్వాలి. ఆ తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ అప్ గ్రేడ్ ని ఎంచుకోవాలి. అందులో వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నిరంతరాయంగా వాట్స్అప్ సేవలను కొనసాగించవచ్చు.