మన హిందూ ధర్మాన్ని ఆచరించే ఉన్న ప్రతి ఆచారం వెనుకా సైన్సు తోపాటు మనుషుల జీవితానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే 3 రోజుల నుండి 10 వరకు కాకులకు అన్నం పిండం పెట్టడం చూస్తూ ఉంటాం. మరణించిన వారు కాకి రూపంలో..కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన పూర్వీకుల కాలం నుండి వస్తుంది.ఈ కారణంగా ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వస్తోంది. కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు. ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందుతారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో వారికి తీర్థం అందువలన అసంతృప్తిగా ఉన్నట్లు గా అనుకున్నట్లు ఉంటాము.
ఆ కోరిక ఏదో తెలుసుకుని దాన్ని తీర్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి కాకులకు పిండం పెట్టే ఆచారం పూర్వం రావణుడికి భయపడి కాకి రూపంలో యముడు మారుతడట. అలాంటి సమయంలోనే కాకులకు గొప్ప వరాలను ఇచ్చాడట యముడు. ఇక కాకులకు ఎటువంటి రోగం రాకుండా కొన్ని వరాలను ప్రసాదించాడట. ఇక అంతే కాకుండా నరక లోకం లో ఉండే మనుషులు విముక్తి పొందాలంటే తమ కుటుంబ సభ్యులకు పెట్టిన పిండ ప్రసాదాలను కాకులు తినాలనే వరం కూడా పెట్టినట్లు పండితులు తెలియజేస్తున్నారు. ఇక యముడు స్వయంగా ఇలాంటి వారం కాకులు ఇవ్వడం వల్లే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సాంప్రదాయం వస్తూనే ఉంది.

శని వాహనుడు కి కాకి వాహనంగా భావిస్తారు. అందుచేతనే కాకులకు మనం ఏదైనా భోజనం పెట్టినట్లు అయితే మనకి ఉండేది తొలగిపోతుందని కొంతమంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు.
మనం ఏదైనా వ్రతం చేసేటప్పుడు ఆహారాన్ని కాకులకు పెట్టినట్లయితే ఆ వ్రతం పరిపూర్ణమైంది అని భావించాలి.
కాకికి అన్నం పెట్టడం ద్వారా యమలోకములో ఉండే మన పిత్రులు.. ఆనందం చెంది మనల్ని ఆశీర్వదిస్తారట.