మహేష్ బాబు ఇంటిలో కందిరీగలు దూరాయి… బెంబేలెత్తిపోతున్న నమ్రత, సితార?

వినడానికి కామెడీగా వున్నా ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్ గురించి అందరికీ తెలిసినదే. ఓ వైపు సినిమాలలో నటిస్తూ కోటాను కోట్లు సంపాదిస్తున్న మహేష్ మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తూ దండిగా సంపాదిస్తున్నాడు. ఇక వీరి లైఫ్ స్టైల్ గురించి ఇక్కడ మాట్లాడుకోవలసిన పనిలేదు. కొన్నేళ్ల కిందటే మహేష్ – నమ్రత తమ కలల సౌధాన్ని తమకు నచ్చినట్టు నిర్మించుకున్నారు. తెలుగు సినిమా ప్రముఖుల ఇళ్లలో వీరిదే ది బెస్ట్ అని చెప్పుకుంటూ వుంటారు ఫిలిం నగర్ జనాలు. అలాంటి ఇంటికి కొన్నాళ్లుగా కందిరీగలు బెడద ఎక్కువయిందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో ఘట్టమనేని అభిమానులు చాలా బాధ పడుతున్నారు.

అంతలా అవి ఇబ్బంది పెట్టడానికి వారి ఇల్లు అడవిలో లేదుకదా? అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ ఇంటి ఆవరణంలో ఎన్నో చెట్లు ఉండడం అందరికీ తెలిసిందే. వాటిలో ఒక చెట్టుకి తేనెటీగలు పట్టు పెట్టినట్టు తాజాగా కనుగొన్నారు నమ్రత. దాంతో అవి అప్పుడప్పుడు వారి ఇళ్లల్లోకి చొరబడి ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దానికి పరిస్కారం కనుక్కొనే పనిలో పడ్డారట నమ్రత. ఇక మన మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా షూటింగులో బిజీగా ఉన్నట్టు సమాచారం. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మిస్తున్న విషయం విదితమే. మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హైట్రిక్ సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ మొదటి నుండి ఆలస్యం అవుతూ వస్తోంది. మొదట్లో కొన్నిరోజులు షూట్ చేసి కథ మారిందని ఆపేయడం జరిగింది. ఆ తరువాత కూడా పలుమార్లు ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు షూటింగ్ సజావుగా సాగుతుండడంతో ప్రస్తుతం మహేష్ బాబుకి వారి ఇంటిలో కందిరీగలు గురించి అస్సలు పట్టడం లేదట. దాంతో నమ్రత అతనిమీద గుర్రుగా ఉందని గుసగుసలు వినబడుతున్నాయి. కాగా ఇది చాలదన్నట్టు…. తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఒకటి సూపర్ స్టార్ అభిమానులను కలవర పెడుతోంది. విషయం ఏమంటే గుంటూరు కారం షూటింగ్ మరోసారి వాయిదా పడనుందట. దానికి కారణం మహేష్ బాబు విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నాడట.

అయితే దీనికి పెద్ద కారణం వుంది. మహేష్ బాబు కొడుకు గౌతమ్ లండన్ లో చదువుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహేష్ గౌతమ్ తో కలిసి జులై 19న లండన్ వెళ్లనున్నారట. అందుకే గుంటూరు కారం షూటింగ్ మరోసారి పోస్ట్ పోన్ చేశారని వినికిడి. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆలస్యం అయిందని, మరలా గ్యాప్ ఇస్తున్నారని మహేష్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో వారు సోషల్ మీడియాలో సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మేము ఎదురు చూస్తున్నాం…. అంటూ కామెంట్స్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పటికైతే ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. మరి వాయిదాల వల్ల అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.