LG Smart TV : ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి రెండు అతిపెద్ద సేల్స్ ను ప్రకటించడం జరిగింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ నిర్వహించబోతున్నాయి . ఇకపోతే ఈ రెండు ఈ కామర్ సంస్థలు కూడా తక్కువ ధరకే కస్టమర్లకు వస్తువులను అందించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను తగ్గింపు ధరకే అందించడానికి సిద్ధమయ్యాయి. ఇక ఈ క్రమంలోనే స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచించేవారికి ఎల్జి కంపెనీ శుభవార్త తెలిసింది.
ప్రముఖ ఎల్జీ కంపెనీ తన కంపెనీ నుంచి LG UQ7500 43 ఇంచెస్ అల్ట్రా హెచ్డీ 4k ఎల్ఈడి స్మార్ట్ టీవీ ని తీసుకొచ్చింది సాధారణంగా మార్కెట్ ధర రూ.49,900.. కానీ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ద్వారా 38% డిస్కౌంట్తో అంటే రూ.19 వేల తగ్గింపుతో కేవలం రూ.30,990 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1550 తగ్గింపుతో రూ.29,440 సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎల్జీ కంపెనీ వన్ ఇయర్ పాటు అడిషనల్ వారంటీ కూడా ఇస్తుంది. ఇక ఈటీవీ ఇతర ఫీచర్స్ విషయానికి 60 Hz రీఫ్రెష్ రేట్ తో, 20W సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది.
3840 x 2160 పిక్సెల్ రిజల్యూషన్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది. ఇకపోతే సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ అంటే పలు యాప్ లకు సపోర్టు చేస్తుంది. కస్టమర్ మెచ్చిన ఈ స్మార్ట్ టీవీ మీకు 4.4 రేటింగ్ను కూడా సొంతం చేసుకుంది.1.5 GB ర్యామ్, 8GB స్టోరేజ్ మెమోరీని కూడా కలిగి ఉంటుంది. 3 HDMI పోర్ట్స్ తో పాటు 1USB పోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఇకపోతే మరెన్నో ఫీచర్స్ ఈ స్మార్ట్ టీవీలో ఉన్నట్లు ఎల్జి కంపెనీ స్పష్టం చేసింది . ఇకపోతే బిగ్ బిలియన్ డేస్ లో ఈ స్మార్ట్ టీవీ ద్వారా మరింత తగ్గే అవకాశం ఉంది.