Vodafone Idea : దేశంలో టెలికామ్ బిగ్గజ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ కస్టమర్లను ఆకర్షించే పద్ధతిలో దూసుకుపోతుంటే వోడాఫోన్ ఐడియా మాత్రం కస్టమర్లను పెద్దగా ఆకట్టుకోవడం లేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎలాగైనా సరే ఎయిర్టెల్, జియో వంటి టెలికాం దిగ్గజ సంస్థలతో పోటీపడుతూ తమ యూజర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా సరికొత్త ఆఫర్ తో మళ్లీ కస్టమర్ల ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. హిందీ పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్ పతి షో కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అతి తక్కువ ధరలో మీ స్మార్ట్ ఫోన్లో మీరు కౌన్ బనేగా కరోడ్ పతి 2022 ఎపిసోడ్ లను చూడవచ్చు.
ఇక అందుకోసం వినియోగదారులు కేవలం రూ. 82 రూపాయలు చెల్లిస్తే నేరుగా మీ స్మార్ట్ ఫోన్లో అన్ని ఎపిసోడ్లను చూడవచ్చు. ఇకపోతే ఇది డేటా ఓచర్ ప్లాన్ మాత్రమే. ఇక అంతేకాదు 82 రూపాయల ప్లాన్ పనిచేయడానికి మీకు బేస్ యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అవసరం అవుతుంది. అప్పుడు 82 రూపాయల ప్లాన్ తో వినియోగదారులు 14 రోజులపాటు 4gb డేటాను ఉచితంగా పొందుతారు. ఇక అంతేకాదు సోనీ లీవ్ సబ్స్క్రిప్షన్ 28 రోజుల వరకు ఇవ్వబడుతుంది. అయితే ఇది కేవలం మొబైల్ సబ్స్క్రిప్షన్ మాత్రమే అని గుర్తించుకోవాలి. వోడాఫోన్ ఐడియా వినియోగదారులు సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఒకసారి ఆక్టివేట్ చేసిన తర్వాత ఈ సబ్స్క్రిప్షన్ ఫాజ్ చేయబడుదు లేదా డి ఆక్టివేట్ చేయబడదు. మీరు 28 రోజులపాటు ఉచితంగా సోనీ లివ్ వీక్షించవచ్చు.
కేవలం కౌన్ బనేగా కరోడ్ పతి 2022 సోని మాత్రమే కాకుండా ఈ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారమయ్యే అన్ని షోలను సినిమాలను కూడా చూసే అవకాశం ఉంటుంది ఇకపోతే సోనీ లీవ్ సబ్స్క్రిప్షన్ పొందిన వారు ఒరిజినల్ టీవీ షోలు, సినిమాలు , ప్రాచుర్యం పొందిన సీరియల్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇక మీరు సంవత్సరం పాటు సోనీ లీవ్ ప్రీమియం పొందాలి అనుకుంటే రూ.999 రూపాయలు చెల్లించాలి. అయితే ఇందులో మీరు టీవీలో కూడా చూసే సౌకర్యం ఉంటుంది. ఇక మొబైల్ ప్లాన్ కోసం రూ.599 చెల్లిస్తే సరిపోతుంది. సోనీ లివ్ కోసం వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ ఆఫర్ అది తక్కువ ఆఫర్ అని చెప్పాలి. మీరు 82రూపాయలతో నెలరోజుల పాటు సోనీ లివ్ వీక్షించవచ్చు.