Vivo Y35 Smart Phone : ప్రముఖ టెక్ దిగ్గజం వివో తాజాగా భారత మార్కెట్లోకి తమ ఉత్పత్తులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ క్రమంలోని స్లిమ్, స్టైలిష్ డిజైన్ కలిగిన వివో Y35 స్మార్ట్ మోడల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్లు కలిగి ఉంది. ఇక మిగతా ఫీచర్స్ , స్పెసిఫికేషన్స్ , ధర విషయాల గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే… 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ కెపాసిటీతో ఉన్న వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.18,499 గా నిర్ణయించారు.
కావాలంటే వన్ టీబీ వరకు మెమరీ ను ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇక వివో ఇండియా, ఈ – స్టోర్స్ అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్ లలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే.. అగేట్ బ్లాక్, డాన్ గోల్డ్ తో సహా రెండు కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ముఖ్యంగా ఐసిఐసిఐ, ఎస్బిఐ, కోటక్, వన్ కార్డ్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే ప్రత్యేక ఆఫర్ కింద 1000రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.6.58 అంగుళాలు ఫుల్ హెచ్డి డిస్ప్లేను కూడా అందిస్తున్నారు.
90 Hz రిఫ్రెష్ రేట్ ను అద్భుతమైన డిజైన్లు కలిగి ఉంటుంది.44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇకపోతే ఈ మొబైల్ కు భద్రత కోసం ఫేస్ వైక్ ఫీచర్ తో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా అందిస్తున్నారు. అంతేకాదు సమర్థవంతమైన అన్ లాకింగ్ ఫీచర్ ని కూడా ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. సరికొత్త వివో Y35 ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రూపొందించబడిన ఫన్ టచ్ ఓఎస్ 12పై రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రధాన కెమెరా తో పాటు 2 ఎంపీ బోకె, టు ఎంపి మైక్రో కెమెరాతో పాటు పెద్ద సెన్సార్ ని కూడా అందిస్తున్నారు. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాని కూడా అందిస్తున్నారు.