VIVO : ప్రముఖ వివో కంపెనీ నుంచి గతవారం వివో v25 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కస్టమర్ల కోసం అమ్మకానికి ఇంకా పెట్టలేదు.. అయితే ఈ ఫోను దేశంలో లాంచ్ అయినప్పటి నుంచి యూజర్లకు ఫ్రీ ఆర్డర్ కు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక ఈ హ్యాండ్ సెట్ గురువారం అర్ధరాత్రి నుండి దేశంలో అమ్మకానికి వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు కార్డు హోల్డర్లకు ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మన ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 35, 999.. ఇది 6.56 అంగుళాల ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమన్సిటీ 1300 ఎస్ఓసి ద్వారా శక్తిని పొందుతుంది. ఇక కెమెరా విషయానికొస్తే 64 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియల్ కెమెరా సెట్ అప్ తో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా అందుబాటులో ఉంది.
ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. వివో స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఒకటి 8 GB ర్యామ్ అలాగే 128 GB స్టోరేజ్ తో లభించగా ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.35, 999.. మరొక వేరియంట్ 12GB ర్యామ్ అలాగే 256 GB స్టోరేజ్ తో లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.39, 999.. ఇక కలర్స్ విషయానికి వస్తే ఒకటి ప్యూర్ బ్లాక్ అలాగే మరొకటి సీలింగ్ బ్లూ కలర్ లో లభ్యం కానుంది. అయితే ఈ రెండు కలర్లు కూడా కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే వివో v25 ప్రో స్మార్ట్ ఫోన్ ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 3,500 తగ్గింపు లభిస్తుంది.
అంతేకాదు ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 20,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లను మార్పిడి చేసుకునేటప్పుడు అదనంగా రూ.3,000 బోనస్ తగ్గింపు కూడా ఉంటుంది. 2376 X1080 పిక్సెల్ రెజల్యూషన్ తో 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇక బాక్స్ లో మీరు యూఎస్బీ టైప్ సీ నుండి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అడాప్టర్, యూఎస్బీ టైప్ సి కేబుల్, ఫోన్ కేసును పొందవచ్చు. అలాగే వివో చార్జింగ్ అడాప్టర్ కూడా లభిస్తుంది. మరొక విశేషమేమిటంటే స్మార్ట్ఫోన్ వెనుక గ్లాస్ ప్యానెల్ కలర్ మారుతున్నట్లు మనకు కనిపిస్తుంది.