Vivo T1X Phone : ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి వివో నుంచి బడ్జెట్ రేంజ్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. Vivo T1X మొబైల్ ను బుధవారం ఇండియాలో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ తో..90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటు తో ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాని కూడా ఈ వివో బడ్జెట్ ఫోన్ కలిగి ఉండడంతో ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లో అందిస్తున్న ఇంటర్నల్ స్టోరేజ్ సరిపోకపోతే మీరు అదనపు ర్యామ్ ను కూడా వర్చువల్ గా పొడిగించుకోవచ్చు.
ఇక 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ధర అన్ని కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. మూడు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉండడం గమనార్హం. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంటులో లభించే స్మార్ట్ ఫోన్ ద్వారా రూ.11,999. 4GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ద్వారా రూ.12,999. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ద్వారా రూ.14,999 గా నిర్ణయించడం జరిగింది. ఈనెల 27వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కామర్స్ సైట్ అయినటువంటి ఫ్లిప్కార్ట్ లో అమ్మకానికి పెట్టనున్నారు.
ఇక ఆఫర్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు యొక్క క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 1000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే..18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000Mah బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్ కి రావడం గమనార్హం. ఇక ఫేస్ అన్ లాకింగ్ సపోర్టు కూడా ఉంటుంది. ఇక వెనుక రెండు ప్రైమరీ కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి 50 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా కాగా రెండు మెగాపిక్సల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.