Viveka Muder Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి మాజీ ముఖ్యమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు..!! తాజాగా ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్న జైల్లో ఓ అధికారి నియామకం జరిగింది..! దాంతో చంద్రబాబు అలర్ట్ అయ్యి జగన్ పై విమర్శలు గుప్పించారు..!!
గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దు శీను ను అనంతపురం జైలులో బయట వారు వచ్చి అతనిని హత్య చేశారు అప్పుడు జైలుకి జైలర్ గా వరుణ్ రెడ్డి ఉన్నారు. దాంతో ఆయనను సస్పెండ్ చేశారు. తాజాగా వరుణ్ రెడ్డి పై ఉన్న పాత కేసులను కొట్టి వేసి జగన్ ప్రభుత్వం ఈయనను కడప జైలర్ గా నియమించింది. అది జిల్లా జైలులో వివేక హత్య కేసులో నిందితుల కూడా అదే జైలులో ఉండటం గమనార్హం. దీనిని బట్టి చూస్తే పరిటాల రవి కేసులో నిందితులను చంపినట్లుగానే..

వివేకా హత్య కేసులో నిందితులను కూడా చంపేందుకు కుట్ర జరుగుతోందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పరిటాల రవి కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని చంపుతూ వచ్చారని వివేకా హత్య కేసులోనూ అదే జరగొచ్చని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జగన్, అవినాష్ రెడ్డి కలిసి వరుణ్ రెడ్డి సాయంతో నిందితులను హత్య చేయించి అవకాశం ఉందని అంటున్నారు. ఓ విధంగా చూస్తే చంద్రబాబు లాజిక్ కరెక్ట్ అనిపిస్తుంది. ఏపీ సీఎం జగన్ ఈ విషయంపై ఎలా స్పందించనున్నారో చూడాలి.