Flash News: ఐపీఎల్‌లో సెన్సేషనల్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 7,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను తన 225వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. డీసీ బౌలర్ అక్షర్ పటేల్‌ వేసిన బంతిని కోహ్లి కట్ షాట్‌తో బౌండరీ బాది 7000వ పరుగు సాధించాడు.

కింగ్ కోహ్లీ IPLలో 7000 పరుగులతో అత్యధిక రన్స్ స్కోరర్‌గా ఉన్నాడు, ఇప్పటివరకు 6536 పరుగులు చేసిన రెండవ స్థానంలో ఉన్న శిఖర్ ధావన్‌ను దాటేశాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లి అన్ని సీజన్లలో RCB తరపున ఆడాడు. ఈ టోర్నీలో 49 అర్ధ సెంచరీలు, ఐదు సెంచరీలతో ఒక ఇన్నింగ్స్‌కు 36.59 పరుగుల సగటుతో కోహ్లీ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ స్టార్ ప్లేయర్ దాదాపు ఆడే ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద సృష్టించాడు.

2016లో RCB తరపున 973 పరుగుల భారీ స్కోర్ చేసి IPL ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా కోహ్లీ తన పేరున లిఖించుకున్నాడు. 2022 ఐపీఎల్‌లోనే అతని పర్ఫామెన్స్ కాస్త తగ్గింది.