నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. ఈ ఏడాది జనవరి 27వ తారీకు ప్రారంభమైన ఈ యాత్ర ఎప్పటి వరకు నిరంతరంగా 8 నెలలు కొనసాగుతూ.. దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో నారా లోకేష్ స్థానిక సమస్యలతో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇదే సమయంలో కొన్ని చోట్ల రైతులతో వివిధ రంగాలకు చెందిన వారితో సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో గుంటూరులో సాగుతున్న పాదయాత్రలో ఆగస్టు 16వ తారీకు యువతతో లోకేష్ భేటీ కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత మహాసేన రాజేష్ హోస్ట్ గా వ్యవహరించారు. విద్యార్థుల తరఫున ఇంకా రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ నీ అడగాలనుకుంటున్న కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులు గురించి ఇంకా అనేక విషయాలు గురించి నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా సరదాగా సాగింది.
అయితే మధ్యలో సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ గురించి ప్రస్తావన వచ్చింది. మహాసేన రాజేష్ విద్యార్థులను ఉద్దేశించి విజయమ్మకి దేవుడు ప్రత్యక్షమై నీకు కొడుకుగా… జగన్ రెడ్డి కావాలా..? లోకేష్ కావాలా అని అడిగితే.. అనగానే స్టూడెంట్స్ అందరూ లోకేష్ నే కొడుకుగా విజయమ్మ కోరుకుంటుంది అని ముక్తకంఠంతో చెప్పారు. అదేవిధంగా దేవుడు షర్మిలకి ప్రత్యక్షమై.. అన్నగా అనేసరికి లోకేష్ నే కోరుకుంటుంది అంటూ స్టూడెంట్స్ సమాధానం ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
https://www.youtube.com/watch?v=Ax-9x9T6GR4