Vijay: విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం వారిసు.. భారీ అంచనాల నడుమ విడులైన ఈ సినిమా అందుకు విరుద్ధంగా డిజాస్టర్ కలెక్షన్స్ రాబడుతూ విజయ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మారబోతుందని కోలీవుడ్ సినీ విశ్లేషకులు ట్వీట్ చేస్తున్నారు. కాగా ఈ స్థాయిలో వారిసు మూవీ కోలీవుడ్ లో డిజాస్టర్ అయినా కూడా దిల్ రాజు సేఫ్ జోన్ లో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది..

విజయ్ వారిసూ చిత్రం మొదటి రోజు ఏకంగా 19.43 కోట్లు కలెక్ట్ చేసింది. రెండో రోజుకి 60 శాతం ఆక్యూపెన్సితో కేవలం 8.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక మూడో రోజు కూడా డ్రాప్ అయ్యి 7.11 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా మూడు రోజుల్లో ఈ మూవీ కలెక్షన్స్ 35.29 కోట్లు మాత్రమే. నిజానికి విజయ్ కి ఉన్న మార్కెట్ స్టామినాకి ఇపాతికే వంద కోట్లకి కలెక్షన్స్ సమీపించాలి. కానీ అందుకు భిన్నంగా ఉన్నాయి కలెక్షన్స్.. కోలీవుడ్ లో వారిసు దియేట్రికల్ రైట్స్ ముందుగానే అమ్మేయడంతో దిల్ రాజు ఆ సినిమా నష్టాల నుంచి తప్పించుకున్నాడు అనే మాట ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. అయితే టాలీవుడ్ లో మాత్రం వారసుడు నష్టాన్ని కచ్చితంగా దిల్ రాజు భరించాల్సి వస్తుందనే టాక్ నడుస్తుంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాని పెద్దగా అడాప్ట్ చేసుకునే ఛాన్స్ లేదనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.