Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కి ఇండస్ట్రీలో ఊహించని స్టార్ డమ్ ఉంది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారన్నా టాక్ వినిపిస్తోంది. విజయ్ ఇన్నేళ్లలో తన రెమ్యూనరేషన్ యాడ్స్ రూపంలో కూడబెట్టిన ఆస్తి విలువలతో ఇప్పుడు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

వికీపీడియా GQ వివరాల ప్రకారం.. దళపతి విజయ్ ప్రస్తుత నికర ఆస్తి విలువ 56 మిలియన్ డాలర్లు. అంటే రూ. 445 కోట్లు. సంవత్సరానికి రూ-120 నుండి 150 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. విజయ్ బీస్ట్ చిత్రానికి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. అలాగే తాజాగా నటించిన వారసుడు చిత్రానికి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. అలాగే విజయ్ సెలక్టివ్ గానే బ్రాండ్ల ప్రమోషన్ చేస్తుంటారు. రకరకాల బ్రాండ్ ఎండార్స్ మెంట్ ల కోసం సంవత్సరానికి రూ. 10 కోట్లు సంపాదిస్తాడు. విజయ్ అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా.. క్రీడా బృందాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. విజయ్ కి అన్ని కోట్ల ఆస్తితో పాటు కొన్ని లగ్జరీ కార్లు, ఐలాండ్స్ లో పిల్లలు ఉన్నాయి బహుశా టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి ఇంత ఆస్తి లేదనే చెప్పాలి.