ఈ క్వాలిటీస్ ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్న విజయ్ దేవరకొండ..!!

హీరో విజయ్ దేవరకొండ..సమంత కలిసి నటించిన “ఖుషి” సినిమా సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేశాడు. తనకు కాబోయే భార్య కి ఇటువంటి క్వాలిటీస్ ఉండాలో వివరణ ఇచ్చాడు. ముందుగా తనకు ఇష్టమైనప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటానని స్పష్టత ఇచ్చాడు.

ఎవరో ఒత్తిడి చేస్తే పెళ్లి చేసుకోను. ఒకవేళ కుదిరితే మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లి చేసుకుంటా. తనతో అన్ని షేర్ చేసుకునే.. ఇస్తా ఇష్టాలు మెచ్చే అమ్మాయే నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు చిన్న చిన్న విషయాలు నాకు వచ్చే భార్య గుర్తు చేసేలా ఉండాలి. ఎందుకంటే తినటం దగ్గర నుంచి.. హాలిడే వరకు చాలా విషయాలు మర్చిపోతా. కనుక నేను చేసుకోబోయే అమ్మాయి అవన్నీ గుర్తు చేసేలా ఉండాలి.

Vijay Devarakonda says he will marry a girl with these qualities

అలానే కాస్త ఇంటిలిజెంట్ అయ్యి తాను ఎంజాయ్ చేసేవి ఆమె కూడా ఎంజాయ్ చేసేలా ఉంటే బాగుంటుంది అని విజయ్ దేవరకొండ నేషనల్ అభిమానులతో చిట్ చాట్ లో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలు నుండి వరుస పరాజయాలతో విజయ్ దేవరకొండ సతమతమవుతున్నాడు. దీంతో “ఖుషి” సినిమా ఎలాగైనా విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ అభిమానుల సైతం ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది.