ఇంటి గుమ్మం ముందు ఈ 3 వస్తువులు పెడితే భర్త ప్రాణాలకే పెను ప్రమాదం తెలుసా?

మన హిందూ ధర్మ సంప్రదాయాల ప్రకారం, కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంటిల్లిపాదికి ఎంతో శుభం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇంటి గుమ్మం ప్రధాన ద్వారానికి తోరణం కట్టిఉంచడం వలన శుభప్రదంగా భావిస్తారు. ఈ క్రమంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక, ఆకులను దండగా కుట్టి కడుతూ వుంటారు. అంతేకాకుండా కొంతమంది బంతిపూల మాలను కూడా కడుతూ వుంటారు.

అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీ పాదాల గుర్తులను వేసుకుంటే ఇంట్లో సంపద, సంతోషాన్ని సూచిస్తుందని ప్రతీతి. అలాగే ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనం కల్లాపి చల్లిన ప్రతీ సారి గడపను కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు, కుంకుమలతో కచ్చితంగా ముగ్గు పెట్టాలి. అలా చేస్తే లక్ష్మీ దేవి మన ఇంటికి వచ్చేందుకు ఇష్టపడుతుందని చెబుతూ వుంటారు. అంటే ఇళ్లు, ఇంటి పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే.. లక్ష్మీ దేవి మన ఇంటికి వచ్చేందుకు, ఇంట్లోనే ఉండేందుకు అంతగా ఇష్టపడుతుందన్నమాట.

ఇక క్రమం తప్పకుండ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వీలైతే ప్రతిరోజూ దీపారాధన చేస్తేనే మంచింది. ఒకవేళ వీలు కాని పక్షంలో రెండు, మూడు రోజులైన సరే దేవుడి ముందు దీపం పెడితే శుభాలే జరుగుతాయి. ఇంతవరకు ఏం చేయాలో తెలుసుకున్నాం. ఇపుడు ఏం చేయకూడదో తెలుసుకుందాం. ఇంటి ముందు గుడి, చెట్టు ముఖ్యంగా ఉండకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. అయితే ఇంటి ఆవరణలో చిన్న చిన్న మొక్కలు ఉండవచ్చు.

ఈ క్రమంలో వాస్తు నిపుణులు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇంటి ఇల్లాలు చేయకూడని మూడు పనులు గురించి చెప్పారు. ఇంటిముందు సింహద్వారం పై కూర్చొని ఆహారం తింటే భర్తకు మంచిది కాదని అంటున్నారు. అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద గోళ్లు కట్ చేయకూడదని చెబుతున్నారు. అలా చేస్తే ఇంటి యజమానికి ఆయుక్షణం అని శాస్త్రం చెబుతోంది. ఇక మూడవది… డస్ట్ బిన్. చెత్త బుట్ట కూడా గుమ్మం ముందు పెట్టవద్దని చెబుతున్నారు. అలా చేసిన ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదని హెచ్చరిస్తున్నారు.