Varasudu: వారసుడు ట్రైలర్ మీద మిస్ అవ్వకూడని memes..

Varasudu: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ చిత్రం వరిసు. ఇది తెలుగులో వారసుడుగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. తాజాగా వారసుడు ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రం ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ.. ఇది చూస్తున్న ప్రజలకు చాలా తెలుగు సినిమాలు మైండ్లో స్ట్రైక్ అవ్వడం గమనార్హం.. దాంతో ఈ సినిమా ట్రోలర్స్ రకరకాల మీమ్స్ క్రియేట్ చేశారు..

Varasudu trailer latest memes viral
Varasudu trailer latest memes viral

వారసుడు ట్రైలర్ చూస్తుంటే కొన్ని సినిమాలు కలగలిపి కొట్టినట్లు ఉందని.. వాటిలో విక్టరీ వెంకటేష్ లక్ష్మీ, మహేష్ బాబు బ్రహ్మోత్సవం, మహర్షి, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, నాని టక్ జగదీష్, నవదీప్ నటించిన గౌతమ్ ఎస్.ఎస్.సి వంటి సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయన్నది వాస్తవం. ప్రస్తుతం సోషల్ లో మీమ్స్ వేసి ఈ ట్రైలర్ ని ట్రెండ్ చేస్తున్నారు. వారసుడు ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ పై మీరు లుక్కేయండి..

Varasudu trailer latest memes viral
Varasudu trailer latest memes viral

ఇక విజయ్ ఎంట్రీ మాత్రం ఫన్నీ గా ఉందని.. విజయ్ చేతిలో రెండు టీ గ్లాసులు పట్టుకుని ఎంట్రీ ఇవ్వడం పై కూడా ట్రోలర్స్ ఓ రేంజ్ లో మీమ్స్ క్రియేట్ చేశారు. హీరో అంటే ఫైట్ సీన్ తో ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే.. విజయ్ ఏంటి కూల్ గా కాఫీ కప్పులు పట్టుకొని వచ్చాడు ఏంట్రా అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. విజయ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ విరసింహారెడ్డి లకు ఇంకా ఏం పోటీ ఇస్తాడో చూడాలి.. బాక్సాఫీస్ బరిలో కనీసం పోటీకైనా నిలబడగలుగుతాడో లేదో చూడాలి..

Varasudu trailer latest memes viral
Varasudu trailer latest memes viral