Upasana..తల్లిదండ్రులు కాబోతున్నామని దాదాపు పది సంవత్సరాలు తర్వాత ప్రకటించి అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగించిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే డెలివరీకి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ అమెరికాలో బుధవారం ” గుడ్ మార్నింగ్ అమెరికా” అనే టాక్ షోలో పాల్గొని.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం , ఆస్కార్ నామినేట్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ టాక్ షో కి అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నీఫర్ ఆస్టన్ కో హోస్ట్గా వ్యవహరించారు.
ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెప్పిన చరణ్ ఫోన్ నెంబర్ తీసుకుంటానని తెలిపారు. అలాగే తన భార్య డెలివరీకి అమెరికాకు వస్తుందని.. తమరు అందుబాటులో ఉంటే బాగుంటుందని కూడా కోరారు. అందుకు జెన్నీఫర్ ఓకే చెబుతూ.. “మీతో ట్రావెల్ చేయడానికి రెడీ.. మీ ఫస్ట్ బేబీ ని డెలివరీ చేయడం నాకు గౌరవమే ” అంటూ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది.
View this post on Instagram