Movies: థియేటర్ లో మళ్ళీ విడుదల – రీరిలీజ్ అవ్వబోతోన్న సినిమాల లిస్టు ఇదే .. ఏ సినిమాకి వెళ్తారో కామెంట్ చేయండి

Movies: టాలీవుడ్ హీరోల కెరీర్ లో సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలన్నింటినీ మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది.. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా, ఖుషి.. ఆ తర్వాత మళ్లీ మహేష్ ఒక్కడు అంటూ ఇలా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది రాబోతున్న అప్ కమింగ్ రీ రిలీజ్ సినిమాలు ఏంటో.. వాటిపై మీరు ఓ లుక్కేయండి..

Up coming tollywood movies re release dates update
Up coming tollywood movies re release dates update

జనవరి 19న వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ది కాశ్మీర్ రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.. మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా 26 న ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మిరపకయ్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 10న టైటానిక్ సినిమా.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా రిలీజ్ అవుతోంది.. ఇవి అఫిషియల్ గా అనౌన్స్ చేసిన చిత్రాలు.. వీటితోపాటు … మరికొన్ని రీ రిలీజ్ కానున్నాయి.

 

జనవరి 20న ఆర్ఆర్ఆర్ సినిమాని దేవీ సెవెంటీ ఎంఎం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రదర్శిస్తున్నట్లు టాక్. ఈ మేరకు బుక్ మై షో టికెట్ బుకింగ్స్ కూడా బుకింగ్ అవుతున్నాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సింహాసనం సినిమా.. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా దేశముదురు సినిమా.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి 4 K రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

 

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది.. ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ -త్రిష జంటగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా.. సెవెన్ బై జి బృందావన్ కాలనీ సినిమాలను కూడా రీ రిలీజ్ కానున్నాయి. వీటిలో మీరు సినిమాకి వెళ్తారో కామెంట్ చేయండి