Nirmala Sitharaman : సిలిండర్ వినియోగదారులకు శుభవార్త తెలిపిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్..!!

Nirmala Sitharaman : నేడు 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టారు. అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే గొప్ప వరాన్ని అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించి వినియోగదారులకు ఊరట కలిగించింది.. ఉత్తరప్రదేశ్ తో సహా మరో ఐదు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు ఉండడంతో డొమెస్టిక్ సిలిండర్ ధరలను పెంచలేదు. అయితే కమర్షియల్ సిలిండర్ ల పైన ఏకంగా రూ.91.50 తగ్గించి వినియోగదారులకు శుభవార్త ను అందించడం జరిగింది. అయితే ఈ ధరలు 2022 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని కూడా స్పష్టం చేయడం గమనార్హం.

ప్రస్తుతం హైదరాబాదులో డొమెస్టిక్ సిలిండర్ ధరలు రూ.952 ఉండగా కమర్షియల్ సిలిండర్ ధర ఒకటి రూ. 2087 గా పరిగణించారు. అయితే అక్టోబర్ నెల నుంచి ఇప్పటి వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ఎలాంటి ధరలు పెరగలేదు. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం పెంచకపోవడం గమనార్హం. అంతే కాదు ఇప్పుడు ఈ కమర్షియల్ సిలిండర్లపై ధరలు కూడా తగ్గించి అందరికీ ఊరట కలిగించింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్ ,గోవా, పంజాబ్, మణిపూర్ వంటి రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.

Union Minister Nirmala Sitharaman gives good news to cylinder users
Union Minister Nirmala Sitharaman gives good news to cylinder users

ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాన్యులపై భారం మోపకుండా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం లేదు అంటూ స్పష్టం చేశాయి. ఒకవైపు ఆయిల్ ధరలు పెరుగుతున్నా గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచకపోవడం విశేషం. జనవరి ఒకటవ తేదీన కమర్షియల్ సిలిండర్ ధర రూ.102.5 తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రూ.91.50 తగ్గించి అందరికీ ఊరట కల్పించడం జరిగింది. డొమెస్టిక్ సిలిండర్ల విషయంపై ఆయిల్ కంపెనీలు కనికరం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్త సంవత్సరం కొత్త బడ్జెట్ తో గ్యాస్ వినియోగదారులకు మంచి ఊరట లభించిందని చెప్పవచ్చు.