Jagadesh Kumar: తెలుగోడికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ చైర్మన్ గా నల్గొండకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ నియమితులయ్యారు..!! కేంద్రం దేశంలోని అత్యుత్తమైన పదమని మరోసారి తెలుగు తేజానికి కట్టబెట్టింది..!!విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ చైర్మన్ గా తెలంగాణకు చెందిన ఆచార్య మామిడాల జగదీష్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుతం ఢిల్లీ వీసీ గా ఉన్న ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది. యూజీసీ చైర్మన్ గా జగదీష్ కుమార్ ఐదు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన జగదీష్ కుమార్ ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ ప్రొఫెసర్. 2016 జనవరి నుంచి జె ఎన్ యు విసిగా ఉన్నారు. ఈయన పదవీకాలం ఈనెల 26 ముగియనుండగా తాజాగా కేంద్రం ఈ పదవిని కట్టబెట్టింది.

యూజీసీ చైర్మన్ పదవి నోటిఫికేషన్ జారీ కాగా 55 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో కమిటీ ఏడుగురిని ఎంపిక చేసి ముగ్గురిని ఫైనల్ చేసి కేంద్రానికి పంపించగా.. వారిలో జగదీష్ కుమార్ ను కేంద్రం ఎంపిక చేసింది. యూజీసీ చైర్మన్ గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి జగదీష్ కుమార్ నిలవడం విశేషం. ఇంతకుముందు వాసిరెడ్డి శ్రీకృష్ణ 1961లో, జీ రామిరెడ్డి 1991లో యూజీసీ చైర్మన్ గా పనిచేశారు.