YS Viveka Case ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కుదిపేస్తుంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావటం తెలిసిందే. ఇక ఇదే సమయంలో నేడు సీబీఐ వైయస్ అవినాష్ రెడ్డి అని ఐదోసారి విచారిస్తూ ఉంది. నిన్న తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకూడదని సీబీఐ విచారణ.. ఆడియో వీడియో రూపంలో రికార్డు చేయాలని కోరాటం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ 30వ తారీకు కేసు మొత్తం కంప్లీట్ చేయాలని సుప్రీంకోర్టు.. సీబీఐకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో విచారణ చివరి దశకు చేరుకున్న క్రమంలో… మరిన్ని అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నట్లు.. ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాదు సీబీఐ కార్యాలయంలో… అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో టీవీ5 జర్నలిస్ట్ మూర్తి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో వయస్సు వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధాలు ఉన్నాయి.. ఇతరులతో గొడవలు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఘటనా స్థలానికి వెళ్లి.. రక్తపు మరకలను ఎందుకు చెరిపేశారు. గుండెపోటు అని ఎందుకు ప్రకటించారు.
మీరు ఎందుకు సాక్షాలను తారుమారు చేశారు. ఎవరో చేశారని మీరు ఆరోపిస్తున్నప్పుడు వాళ్లను కాపాడాల్సిన పని మీకెందుకు.. అంటూ.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో టీవీ ఫైవ్ మూర్తి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైయస్ వివేకానంద రెడ్డి అల్లుడు మరియు కూతురు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి అలాంటప్పుడు హత్య జరిగిన స్థలంలోకి మొదట వెళ్లి సాక్షాధారాలను తారుమారు చేయాల్సిన అవసరం మీకు ఎందుకు అంటూ.. కొందరు ప్రశ్నిస్తున్నారని జర్నలిస్టు మూర్తి.. నిలదీశారు.