YS Avinash Reddy : శాసనమండలి ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ బరితెగించింది. ప్రజాస్వామ్యానికి పాతర వేసింది. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు, పోలింగ్ కేంద్రాల వద్దనే ఓటుకు నోటు అందించింది. జిల్లా వ్యాప్తంగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. కడప, ప్రొద్దుటూరు, తిరుపతి ఇలా ప్రతి చోట వైసిపి ఆధిపత్యాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతకు దిగజారిందో.. జగన్ ప్రభుత్వం చేసే అరాచకాల పై టీవీ5 ప్రతినిధి సాంబశివరావు పలు విషయాలను తెలిపారు..
ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిందో కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు సాంబశివరావు. ఓటుకు నోటు మద్యం వారి మాటకు అడ్డొస్తే వేటుకి కూడా వెనక్కి తగ్గని వైనం వైసిపి ప్రభుత్వం మంచి అనే రంగు పులుముకుని.. తనే అధికారంలో ఉండాలని ఎంతకైనా ఒడిగడుతుందని.. నిన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో జరిగిన కుట్రలు, కుతంత్రాలు చూస్తేనే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేసుకుని ఎవరు ఎక్కువ మందిని చంపుకుంటే వారి రాజ్యాన్ని ఏలే వారు ఇప్పుడు కూడా అదే పరిస్థితిని తలపిస్తుందని ఆయన అన్నారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ముసుగులో జరుగుతున్న అరాచకాలు ఎన్నో చేస్తున్నారు. వైసిపి పార్టీ అయితే ఒక రాజకీయ పార్టీ లాంటిది పెట్టుకుని అధికారం చేజెక్కించుకొని ఎంత అరాచకాలు చేస్తుందో మనం చూస్తున్నాం. గత ఎన్నికల్లో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పారు అప్పటి ప్రభుత్వంపై బోలెడు కట్టు కథలు అన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని వారిపై లేనిపోని కట్టు కథలు అన్నీ వారిని నెగిటివ్ గా ప్రచారం చేయడమే ధ్యేయంగా పెట్టుకొని .. ఆ విధంగా వారిపై అభయోగాలను మోపి ఈరోజు అధికారం చేజేక్కించుకొని వేరు చేసే అరాచకాలు అన్ని ఇన్ని కాదు అని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యానికి మనుగడ తీసుకువచ్చేదే ఏ రాజకీయ పార్టీ అయినా. మీరు మీరు తన్నుకొని చావడం కాదు.. ప్రజలకు మంచి చేయడం వారి బాగోగులతో పాటు వారికి వెన్నుదాన్నులా ఉండాలి. ఎంతోమంది స్వాతంత్రం రావడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా యోధుల్లాగా పోరాటాలు చేశారు. అలాగా ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం రాజకీయ పార్టీలు సేవ చేయాలని సాంబశివరావు అన్నారు. అంతేకానీ వైసీపీ ప్రభుత్వం లాగా ఇలా ఓట్ల కోసం తప్పుదోవ పట్టడం సరికాదని ఆయన అన్నారు.